Hyderabad: బెస్ట్ ఫ్రెండ్ అని ఇంట్లో పెట్టుకుంటే.. మిత్రుడు భార్యతో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి
ఎవరినైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే ముందు అతడి బుద్ది ఏంటో ఆలోచించండి. లేదంటే ఇంట్లోని వాళ్లు అతడి వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది.

ప్రెండ్షిప్ వాల్యూ తీసేశాడు ఓ ప్రబుద్దుడు. బెదిరించి స్నేహితుడి భార్యనే చెరబట్టబోయాడు. బెస్ట్ ఫ్రెండ్ అని ఇంట్లో పెట్టుకుంటే కీచకుడి మాదిరిగా వ్యవహరించాడు. బాధితురాలు.. షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో.. కామాంధుడిని సెల్‌లో వేశారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్ సల్మాన్(23) అనే వ్యక్తికి ఓ ఫ్రెండ్ ఉన్నాడు. వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సల్మాన్‌కు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు మిత్రుడు. కానీ సల్మాన్ బుద్ది మంచిది కాదు. అన్నం పెట్టిన ఆ మహిళపైనే కన్నేశాడు. మిత్రుడు ఇంట్లో లేనప్పుడు సల్మాన్ ఆమె వైపు అదోలా చూసేవాడు. ఆమె మాత్రం అతడ్ని అసలు పట్టించుకునేది కాదు.
దీంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు సల్మాన్. ఇందుకోసం నీచపు పనికి పాల్పడ్డాడు. మిత్రుడు తన భార్యతో సన్నిహితంగా ఉన్న సమయంలో.. సీక్రెట్ కెమెరా సాయంతో ఆ దృశ్యాలను షూట్ చేశాడు. అనంతరం ఆ వీడియోను మిత్రుడి భార్యకు చూపించి.. తన వాంఛను తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు ఎక్కువవ్వడంతో బాధితురాలు.. విషయం భర్తకు చెప్పి.. ఆపై షీ టీమ్స్‌ను ఆశ్రయించింది.
దీంతో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు.. అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడిని దోషిగా గుర్తించి.. 8 రోజుల జైలు శిక్ష విధించింది. మహిళలు వేధింపులను సహించవద్దని.. ఇబ్బంది ఉంటే వెంటనే షీ టీమ్స్‌ను అప్రోచ్ అవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని.. ఎటువంటి జంకూ అవసరం లేదని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
