Munugode: నమ్మి గెలిపిస్తే కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిండు.. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ ఫైర్..

Munugode: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ప్రజలు నమ్మి గెలిపిస్తే..

Munugode: నమ్మి గెలిపిస్తే కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిండు.. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ ఫైర్..
Revanth Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 03, 2022 | 9:26 PM

Munugode: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ప్రజలు నమ్మి గెలిపిస్తే రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవిని అమ్ముకున్నాడంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజగోపాల్‌ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌పై ప్రేమతో మునుగోడు ప్రజలు గెలిపిస్తే.. ఆ పదవిని రూ. 22 వేల కోట్లకు అమ్ముకున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని అమ్ముకున్న రాజగోపాల్ రెడ్డికి మరోసారి ఓటు వేయొద్దని మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

తన స్వార్థం, తన అవసరాల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. ఎక్కడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు రేవంత్. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు ఉన్నాయని, మండల స్థాయి నేతలు నిత్యం ఓటర్లకు టచ్‌లో ఉంటూ కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడు విజయంతో.. రాబోయే ఎన్నికల్లో విజయానికి శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించారు రేవంత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..