Komati Reddy: ఆ ఒక్క పనితో కోమటిరెడ్డి హీరో అయ్యారు.. అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టి..
Komatireddy Venkat Reddy: ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కామెంట్స్ దుమారాన్ని లేపాయి. ఆ నష్టం నుంచి కూడా పార్టీకి పాజిటివ్ అయ్యేలా చేసారు ఆ ఎంపీ, బీఆర్ఎస్‌కు దీటుగా కౌంటర్ ఎటాక్ చేస్తూ.. అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. ఇంతకీ ఎవరా ఎంపీ.. ఆ ఎంపీ ఎంచేశారంటే..

హైదరాబాద్, జూలై 17: గత మూడు రోజులు ఉచిత విద్యుత్ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి వాఖ్యలు కొంత పార్టీకి డ్యామేజ్ చేశాయి అని సొంత పార్టీ నేతలు భావిస్తున్న తరుణంలో సస్పెన్స్ ఎంట్రీ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ కు దీటైన సమాధానం ఇస్తూ అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆక్టివిటీ పై సొంత పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉచిత కరెంటు ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగి మొదట డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి వాఖ్యలను వక్రీకరించారంటూ గట్టి జవాబిచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతే కాదు అసలు తెలంగాణలో ఎక్కడా 10 గంటలకు మించి కరెంటు రావడం లేదంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి. దమ్ముంటే తనతో ఫీల్డ్ విజిట్‌కు రావాలని సవాల్ విసిరారు ఎంపీ కోమటిరెడ్డి.
దీంతో చర్చ కాస్తా రేవంత్ రెడ్డి వాఖ్యలను పక్కకు తప్పించి విద్యుత్ ఎన్నిగంటలు సరఫరా అవుతుందనేదానిపైకి మళ్ళింది.. వెనువెంటనే ఫీల్డ్ విజిట్‌కు దిగిన ఎంపీ కోమటిరెడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా లో సబ్ స్టేషన్‌లు పరిశీలిస్తూ 11 గంటలకు మించి ఏ సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా కావడం లేదని నిరూపించారు. దీంతో అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్ స్టేషన్‌ల పర్యటనతో మిగతా పార్టీ నాయకులు ఇదే కార్యక్రమాన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో సబ్ స్టేషన్‌లు విజిట్ చేసి.. కరెంటు ఎక్కడా 10 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని నిరూపించి ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టాలని డిసైడ్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం