Tragedy: ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన అమ్మ

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 11, 2021 | 7:46 AM

ఆ తల్లికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోయినా పిల్లలున్నారని గుండె నిబ్బరం చేసుకుంది. బాధను దిగమింగుకుని వారిని పెంచి పెద్ద చేసింది. కానీ ఊహించని విషాదం ఆ తల్లిని వెంటాడింది.

Tragedy: ఎంత కష్టం వచ్చింది తల్లి..  కుమారుడి చితికి తలకొరివి పెట్టిన అమ్మ
mother has done funerals

Follow us on

భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అన్నీ బాధలే. ఇద్దరు బిడ్డల్ని పోషించేందుకు ఆమె కూలీ పనులకు వెళ్లేది. వారు భవిష్యత్‌లో బాగా బతుకుతారని ఆశపడింది. పెద్ద కుమారుడు చేతికందాక ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకుంటాడని అనుకుంది. చిన్న కుమారుడు అన్నకు సాయంగా ఉంటాడని భావించింది. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతోంది. ఆ ఇంట ఊహించని విషాదం చోటుచేసుకుంది. చివరకు కొడుక్కి తల్లే తలకొరివి పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన గోగుల పద్మకు ఇద్దరు తనయులు. పద్మ భర్త చాలా ఏళ్ల క్రితమే కాలం చేశాడు. కాయకష్టం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను ఆమే పెంచి పెద్ద చేసింది. భర్త చనిపోయి చాలా ఏళ్లు కావటంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఆర్థికంగా అండ లేకపోవడంతో కుటుంబంలో అప్పులు పెరిగిపోయాయి. అప్పులు పెరగడం, ఊర్లోని వ్యక్తుల సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన పెద్ద కుమారుడు వెంకటేష్​(25).. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. ఇక్కడ కూడా విధి చూడండి ఎలాంటి ఆట ఆడిందో. చిన్న కుమారుడు తల కొరివి పెట్టకూడదని బంధువులు చెప్పడంతో.. బాధను దిగమింగుకుని వెంకటేష్​ చితికి తల్లే కొరివి పెట్టింది. ఆ తల్లి బాధను చూసి బంధువులు, గ్రామస్థుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: ఈ ఫోటోలోని వ్యక్తి టాలీవుడ్‌లో చాలా ఫేమస్.. హీరోగా కూడా చేశారు.. ఎవరో గుర్తించగలరా..?

 మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డుప్రమాదం.. కొనసాగుతున్న చికిత్స ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu