Sai Dharam Tej Accident High Lights: చికిత్సకు స్పందిస్తున్న సాయి ధరమ్ తేజ్.. అపోలో ఆసుపత్రికి సెలబ్రెటీల క్యూ..
మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డుప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ధరమ్ తేజ్ కు గాయాలవడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sai Dharam Tej : మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ధరమ్ తేజ్ కు గాయాలవడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి చేరుకున్నారు.
తేజ్‌కు శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిందని .. ప్రస్తుతం కోలుకుంటున్నాడని మెగా ఫ్యామిలీ తరపున అల్లు అరవింద తెలిపారు. చికిత్స జరుగుతుందని.. అభిమానులు ఆందోళపడాల్సిన అవసరం లేదని అరవింద్ తెలిపారు.
LIVE NEWS & UPDATES
-
అపోలో హాస్పిటల్ అప్డేట్
ఆపోలో ఆసుపత్రికి చేరుకున్న సీనియర్ నటి జయసుధ..
-
ప్రమాదంపై నరేష్ వ్యాఖ్యలు సరికాదన్న శ్రీకాంత్..
సాయి ధరమ్ తేజ్‌కు జరిగింది చిన్న ప్రమాదం.. సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి తిరిగి వస్తాడు. ఎవరికైనా సర్వసాధారణంగా జరిగే ప్రమాదమే ఇటువంటి సమయంలో నరేష్ చావుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ని సీనియర్ నటుడు శ్రీకాంత్ అన్నారు.
-
-
సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన తరుణ్..
సాయిధరమ్ తేజ్ ని ఇప్పుడే కలిసి రావడం జరిగింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఎలాంటి ప్రమాదం లేదు. స్నాక్స్ కూడా తింటున్నాడు. తొందరలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడని హీరో తరుణ్ తెలిపారు.
-
అపోలో హాస్పిటల్ అప్డేట్
ఆపోలో ఆసుపత్రికి చేరుకున్న హీరోయిన్ రాశిఖన్నా..
-
ఎలా మాట్లాడాలో నేర్చుకోండి.. నరేష్ పై బండ్ల గణేష్ ఫైర్..
కాసేపటి క్రితం అపోలో ఆసుపత్రికి చేరుకున్నాడు బండ్ల గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కు జరిగింది చిన్న ప్రమాదం.. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి వస్తాడు. త్వరలోనే షూటింగ్స్‌లో పాల్గొంటాడని బండ్ల గణేష్ చెప్పాడు. అలాగే ఈ సమయంలో ప్రమాదంలో చనిపోయిన వాళ్ల పేర్లు చెప్పడం.. సరికాదని.. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోవాలంటూ నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
-
తేజ్ ఆరోగ్యం గురించి స్పందించిన మనోజ్..
కాసేపటి క్రితం అపోలో ఆసుపత్రికి వెళ్లారు మంచు మనోజ్. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మంచు మనోజ్ మీడియాతో మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ దురదృష్టకరం. ఆక్సిడెంట్ తర్వాత రోడ్ బాగు చేసినందుకు ధన్యవాదాలు. ఇంకొకరికి ఇలా జరగకుండా చర్యలు తీసుకున్నందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు మంచు మనోజ్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరగా కోలుకుని మనకు హిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుతున్నాను అన్నారు మంచు మనోజ్.
-
అపోలో హాస్పిటల్ అప్డేట్
ఇప్పుడే అపోలో హాస్పిటల్ కి వచ్చిన యాక్టర్ తరుణ్..
-
అపోలో హాస్పిటల్ అప్డేట్
ఇప్పుడే అపోలో హాస్పిటల్ కి వచ్చిన యాక్టర్ మంచు మనోజ్..
-
సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల..
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. తేజ్‌కు అంతర్గతంగా గాయాలు కాలేదని.. ప్రస్తుతం చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు. డాక్టర్ ఆలోక్ రంజన్ నేతృత్వంలో వైద్యం అందిస్తున్నారు అపోలో వైద్య బృందం.
-
చికిత్సకు స్పందించి స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వీడియో..
గత రాత్రి సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిన వెంటనే మెడికొవర్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి మెడికొవర్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్సకు సాయి ధరమ్ తేజ్ స్పందించిన వీడియోను వైద్యులు విడుదల చేశారు.
వీడియో..
-
త్వరగా కోలుకొని సూపర్ హిట్ సినిమాలు చేయాలి.. విజయశాంతి..
చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, ఆర్టిస్ట్ సాయి ధరమ్ తేజ్.. తొందరగా కోలుకోవాలని.. సూపర్ హిట్ సినిమాలను అందించాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను… సీనియర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. ట్వీట్..
సాయి ధరమ్ తేజ
చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, మరియు ఆర్టిస్ట్.
సత్వరమే కోలుకోవాలని, విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
Wishing Him a to Get Well Soon
విజయశాంతి pic.twitter.com/uAD3ISvE8W
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 11, 2021
-
అందుకే తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది.. మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్..
గోల్డెన్ అవర్‌లో సాయి ధరమ్ తేజ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చారు.. అందుకే ప్రాణాపాయం తప్పింది. హెల్మెట్ ధరించడం వల్లే తలకు గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు ఫిట్స్ వచ్చినట్లు 108 సిబ్బంది తెలిపారు. షోల్డర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యింది.. బాడీలో చిన్న చిన్న ఇంజూరీస్ ఉన్నాయి. మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్..
-
నా తమ్ముడు త్వరగా కోలుకోవాలి.. మంచు విష్ణు..
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తున్న సెలబ్రెటీలు.. మై లిటిల్ బ్రదర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ మంచు విష్ణు తన ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు.
ట్వీట్..
Praying for the speedy recovery of my little brother @IamSaiDharamTej
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2021
-
అపోలో ఆసుపత్రికి చేరుకున్న మంచు లక్ష్మీ..
నాకు తెలిసినంతవరకు అత్యంత బాధ్యతాయుతమైన పౌరులలో తేజ్ ఒకరు. అతను ఎప్పుడు వేగంగా వెళ్లలేదు. రోడ్డు పై మట్టి ఉండడం ప్రమాదానికి దారి తీసింది. రూమర్స్ ఇంకా పెంచకండి అని అందరిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం తేజ్ రెస్పాండ్ అవుతున్నాడు. అతను తొందరగా కోలుకొవాలని అందరూ ప్రార్థించండి.. అంటూ మంచు లక్ష్మీ ట్వీట్స్ చేశారు.
Tej is one of the most responsible citizens that I know. It is very clear that he wasn’t speeding at any given moment. There was mud on the road that led to the accident. I request all of you to stop spreading rumours.
— Lakshmi Manchu (@LakshmiManchu) September 11, 2021
-
మెగా అభిమానులు ఆందోళ చెంద వద్దు…
శ్రీ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని.. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులయి త్వరలోనే మన ముందుకు వస్తారు…అభిమానులు ఆందోళన చెంద వద్దని అని అఖిల భారత చిరంజీవి యువత విజ్ఞప్తి
-
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రాద్దనలు..
అమ్మప్రేమ ఆదరణ సవస్థకు గతం లో భారీగా విరాళం చేశాడు సాయి ధరమ్ తేజ్. వృదులకోసం రెండంతస్తుల భవనం కట్టించాడు సాయి ధరమ్ తేజ్. అందరి బాగుకోరే ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసాక అన్నం కూడా తినబుద్ది కావడంలేదంటున్న వృద్ధులు..
-
జీహెచ్ఎంసీ పైన కేసు నమోదు చేస్తాం…
రోడ్డు పై ఇసుకను తొలగించకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది అన్నారు రాయదుర్గం సీఐ రాజగోపాల్ రెడ్డి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ పైన కేసు నమోదు చేస్తాం అన్నారు ఆయన.
-
అపోలోకి చేరుకున్న మెగాస్టార్
అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం నిలకడగా తేజ్ ఆరోగ్యం..
-
అసలు సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం ఎలా జరిగిందంటే..
రాత్రి 7.45కి జూబ్లిహిల్స్ నుంచి గచ్చిబౌలికి బయల్దేరిన సాయిధరమ్‌తేజ్ రాత్రి 7. 58కి కేబుల్ బ్రిడ్జి మీదుగా ప్రయాణం రాత్రి 8 గంటలకు కోహినూర్ హోటల్ దాటి ఐకియా వైపుకు జర్నీ రాత్రి 8 గంటల 5 సెకండ్ల సమయంలో బైక్ స్కిడ్ 8.05 కి 108కి కాల్ చేసిన స్థానికులు రాత్రి 8. 26కి మెడికవర్ ఆసుపత్రికి తరలింపు 8. 27కి 100 ద్వారా కాల్ రిసీవ్ చేసుకున్న మాదాపూర్ పోలీసులు 8.35కి మెడికవర్ హాస్పిటల్‌కి చేరుకున్న మాదాపూర్ పోలీసులు 8.45కి మెడికవర్ హాస్పిటల్‌లో సాయిధరమ్‌కు చికిత్స ప్రారంభం రాత్రి 9 గంటలకు మెడికవర్ హాస్పిటల్‌కి సాయిధరమ్ కుటుంబ సభ్యులు రాత్రి 10. 45కి అపోలో హాస్పిటల్‌కి తరలింపు రాత్రి 12. 30కి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన అపోలో హాస్పిటల్
-
ముందే నేను తేజ్ ను హెచ్చరించా : నరేష్
నా ఇంటి దగ్గర నుంచే సాయి ధరమ్ తేజ్ బయలుదేరాడు అన్నారు సీనియర్ నటుడు నరేష్ . సాయి, నా కుమారుడు ఇద్దరూ రైడింగ్ చేస్తారు.. రైడింగ్ పై ఇదివరకే ఇద్దరినీ హెచ్చరించా అన్నారు నరేష్.
-
వీకెండ్ పార్టీకి వెళ్తుండగా ఘటన..
వీకెండ్ పార్టీకి వెళ్తున్న సమయంలో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు…
-
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది: సంగీత రెడ్డి అపోలో MD
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. ఎవరు అందోళన పడాల్సిన అవసరం లేదు..వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము.. ఎప్పటికప్పుడి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆమె అన్నారు.
-
షాక్‌తోనే సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి..
ఒక్కసారిగా కింద పడటంతో షాక్‌లో సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని అంటున్నారు వైద్యులు
-
డాక్టర్ల పర్యవేక్షణలో తేజ్ ..
తేజ్‌ను మరో 24గంటలపాటు ఐసీయూలోనే ఉంచనున్నామని తెలిపిన వైద్యులు.. మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు.
-
తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం: శ్రీకాంత్
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాంమన్న హీరో శ్రీకాంత్.
-
ఎవరు ఆందోళన చెందవద్దు : ప్రకాష్ రాజ్
సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ప్రకాష్ రాజ్. వైద్యులతో మాట్లాడమని తెలిపిన ప్రకాష్ రాజ్
-
అపోలోకి చేరుకున్న ప్రకాష్ రాజ్
ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ కుటుంబసభ్యులను సినీప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. తేజ్ ఫ్యామిలీని అడిగి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు ప్రకాష్ రాజ్.
-
అపోలోకి చేరుకున్న రామ్ చరణ్
కొద్దిసేపటిక్రితమే అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు హీరో రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన
-
అవయవాల పనితీరు సాధారణంగానే..
కొనసాగుతున్న చికిత్స.. అవయవాల పనితీరు సాధారణంగానే ఉందన్న వైద్యులు..
-
విడుదలైన తేజ్ హెల్త్ బులెటెన్
నిలకడగా తేజ్ ఆరోగ్యం.. ఇంకా ఐసీయూలోనే తేజ్.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..
-
ఆ భగవంతుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు : బండ్ల గణేష్
సాయి ధర్మ తేజ్ ప్రమాదం పై బండ్లగణేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. ఎప్పుడూ తోనే ఉంటాడు సాయి ధరమ్ తేజ్‌తోనే ఉంటాడని.. తేజ్‌కు ఏంకాదు.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. అతను త్వరగానే కోలుకుంటాడు అంటూ ట్వీట్ చేశారు బండ్ల.
God always with you @IamSaiDharamTej is absolutely fine and recovering. Nothing to worry. He is under precautionary care in hospital.
— BANDLA GANESH. (@ganeshbandla) September 10, 2021
-
మరి కాసేపట్లో సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్
మరి కాసేపట్లో సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు అపోలో వైద్యులు..
-
ఇసుక పై స్పీడ్‌గా వచ్చి బ్రేక్ వేయడంతోనే..
స్పీడ్‌గా వస్తూ రోడ్డు పై ఉన్న ఇసుక పై సడన్‌గా బ్రేక్ వేశాడు తేజ్.. దాంతో బైక్ పై నుంచి ఎగిరిపడ్డాడు తేజ్
-
సాయి ధరమ్ తేజ్ పై పోలీస్ కేసు…
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సాయి ధరమ్ తేజ్ పై పోలీస్ కేసు నమోదైంది. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఆయన పై పోలీస్ కేసు నమోదైంది.
-
సాయి ధరమ్ తేజ్‌కు సర్జరీ చేయనున్న వైద్యులు..
సాయి ధరమ్ తేజ్ కలర్ బోన్ విరగడంతో సర్జరీ చేయనున్న వైద్యులు..
-
నలుగురు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స
సాయి ధరమ్ తేజ్‌కు నలుగురు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. నాలుగు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స..
-
అపోలో హాస్పటల్లో పవన్ కళ్యాణ్..
అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్‌తో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. సమాచారం తెలుసుకుంటున్న పవన్
-
ఇంకా అపస్మారక స్థితిలోనే తేజ్…
ఇంకా అపస్మారక స్థితిలోనే సాయి ధరమ్ తేజ్.. తేజ్ కళ్ళు తెరిస్తే ఆయన ఆరోగ్యం పై ఓ అంచనాకు వస్తామంటున్న వైద్యులు.
-
అపోలో వైద్యులతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అపోలో వైద్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాధుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారని ఆయన అన్నారు.
-
రాత్రినుంచి అన్న దగ్గరే వైష్ణవ్ తేజ్..
నిన్న రాత్రి నుంచి అపోలో అన్న దగ్గరే వైష్ణవ్ తేజ్ ఉన్నాడని తెలుస్తుంది. మిగిలిన వారు పరామర్శించి వెళ్లిపోయారు.
-
తేజ్‌కు 6 నుంచి 8 వారల పాటు విశ్రాంతి..
చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ 6 నుంచి 8 వారల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు..
-
మరికొద్ది గంటల్లో హెల్త్ బులిటెన్..
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి సుమారు 10-11 గంటల మధ్య వైద్యులు మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
-
ఎటువంటి ఆందోళన అవసరం: వైద్యులు
తేజ్ ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన అవసరం లేదంటున్నారు అపోలో వైద్యులు..
-
సాయి ధరమ్ తేజ్‌కు కొనసాగుతున్న చికిత్స..
నిన్న రాత్రి నుండి అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్‌కు కొనసాగుతున్న చికిత్స. ఇప్పటికే అర్థరాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు.
-
నిన్న రాత్రే హుటాహుటిన హాస్పటల్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు…
చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, హీరో సందీప్ కిషన్, నిహారిక హుటాహుటిన నిన్నరాత్రి హాస్పటల్‌కు చేరుకున్నారు.
-
తేజ్‌కు వెంటిలేటర్ పై చికిత్స…
తేజ్‌కు వెంటిలేటర్ పైన చికిత్సను అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.
-
నా ఫ్రెండ్ త్వరగా కోలుకుంటాడు : తమన్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సినీప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందిస్తూ.. నా మిత్రుడు తేజ్‌కు ఏం కాదు. అతడు త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటిస్తాడు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయకండి.. అంటూ రాసుకొచ్చారు.
All will be well with @IamSaiDharamTej !! I knw My Nanban ♥️He will be back to Work very very VERY SOON ?
I sincerely request from bottom of my heart ❤️ Let’s make it look healthy and warm & by not speculating things ?? which are Not actually it is ⭐️
My HERO?♂️IS SAFE ☘️ pic.twitter.com/FZ0HgwwZCU
— thaman S (@MusicThaman) September 10, 2021
-
48 గంటలు అబ్జర్వేషన్ ..
సాయి ధరమ్ తేజ్‌ను 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్టు వైద్యులు తెలిపారు..
-
ఆర్గాన్ డామేజ్ లేదంటున్న వైద్యులు..
సాయి ధరమ్ తేజ్‌కు ఇన్‌సైడ్ బ్లీడింగ్ కానీ.. ఆర్గాన్ డామేజ్ లేదంటున్న వైద్యులు..
-
పలు టెస్ట్‌లు పూర్తి చేసిన డాక్టర్లు..
తేజ్‌కు సిటీ స్కాన్ తోపాటు పలు టెస్ట్‌లు పూర్తి చేశారు డాక్టర్లు.. కాలర్ బోన్ విరిగినట్టు ప్రకటించిన వైద్యులు..
-
నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం..
ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పటల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే ఆయన కోలుకుంటారని అంటున్నారు.
-
తేజ్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది : అరవింద్
తేజ్‌కు శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిందని .. ప్రస్తుతం కోలుకుంటున్నాడని మెగా ఫ్యామిలీ తరపున అల్లు అరవింద తెలిపారు. చికిత్స జరుగుతుందని.. అభిమానులు ఆందోళపడాల్సిన అవసరం లేదని అరవింద్ తెలిపారు.
Published On - Sep 11,2021 6:23 AM