Palla Rajeshwar Reddy: కేంద్ర ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
MLC Palla Rajeshwar Reddy: కేంద్ర ప్రభుత్వంపై రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో..
Palla Rajeshwar Reddy: కేంద్ర ప్రభుత్వంపై రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూల్చే వరకు టీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వ్యా్ఖ్యానించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం మాకు అవసరం లేదని, మా వరి కోనే ప్రభుత్వాలకే మా మద్దతు ఉంటదని, బీజేపీ ప్రభుత్వం కూల్చే అన్ని శక్తులతో కేసీఆర్ కలుస్తారని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎవరు ఫైట్ చేసినా వాళ్లకు మా మద్దతు ఉంటుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తులతో కేసీఆర్ చర్చలు జరుపుతారని, అవసరం అనుకున్న సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
రూ.50వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో వేసిన ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఓర్వలేకపోతున్నారని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో అధికారికంగా 2 లక్షలు, అనధికారికంగా 4 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 141 మెట్రిక్ టన్నుల ఎఫ్‌సీఐకి తెలంగాణ ఇచ్చిందన్నారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ రోజు వరకు రూ.5,447 కోట్లు రైతులకు నిధులు ఇచ్చామని, తమపై కేంద్ర మంత్రి మంత్రులు నిత్యం అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వరి వేస్తే అంగీకరించే ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: