Telangana: ఆరోపణలు రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రఘునందన్‌రావుకు.. రోహిత్ రెడ్డి మరో సవాల్..
బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోపణలపై బీజేపీ నేతలు ఎక్కడికి రమ్మంటే..
బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోపణలపై బీజేపీ నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. డ్రగ్స్ కేసు ఆరోపణలపై బండి సంజయ్‌కు నిన్న సవాల్ చేసిన BRS MLA పైలెట్ రోహిత్‌రెడ్డి ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు మరోసవాల్ విసిరారు. ఈ ఏడాది సెప్టెంబర్‌కు ముందు సింహయాజులు స్వామితో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. లేదంటే రఘునందన్‌రావు రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. శనివారం బండి సంజయ్‌కు పెట్టిన డెడ్‌లైన్‌కు తగ్గట్లుగానే ఇవాళ మరోసారి భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వెళ్లారు రోహిత్‌రెడ్డి. బండి సంజయ్ రాలేదు కాబట్టి ఆయన తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నది స్పష్టమైపోయిందన్నారు. భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి కాకపోతే వేములవాడకు వస్తారా అని మరోసారి సవాల్ చేశారు.
తాను బండి సంజయ్‌కు ఛాలెంజ్ చేస్తే ఆయన రాకుండా రఘునందన్‌రావు ఆరోపణలు చేయడంపై తీవ్రంగా స్పందించారు రోహిత్‌రెడ్డి. రఘునందన్‌రావు చేసిన ప్రతి ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తనకు సర్ఫాన్‌పల్లిలో ఫాంహౌస్, రిసార్ట్ ఉన్నాయని నిరూపిస్తే వాటిని ఆయనకు రాసి ఇచ్చేస్తానని సవాల్ చేశారు రోహిత్‌రెడ్డి.
బండి సంజయ్ నిజమైన హిందువు కాదని విమర్శించారు రోహిత్ రెడ్డి. తాను నిజమైన హిందువుగా అమ్మవారి వద్ద సవాల్ చేశానని రోహిత్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ మతం పేరుతో రెచ్చగొట్టి యువతని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రఘునందన్ రావు పఠాన్ చెరులో పరిశ్రమల నుంచి డబ్బులు వసూళ్లు చేయలేదా అని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..