AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీరికి ప్రాణసంజీవిని ఈ కంటైనర్ ఆసుపత్రి.. దేశంలోనే తొలి ఆవిష్కరణ..

ఆ గిరిపుత్రులకు ఎంతటి ప్రమాదకర రోగం వచ్చినా చెట్ల పసర్లే శరణ్యం. గర్భిణీ స్త్రీలను సైతం మైళ్ళదూరం జోలెకట్టి మోసుకెళ్లిన దృశ్యాలు ఎన్నో చూశాం. అలాంటి మారుమూల గిరిజన బిడ్డల ఆయుష్షు పెంచడం కోసం మంత్రి సీతక్క ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన కంటైనర్ హాస్పిటల్స్ ప్రస్తుతం చర్చగా మారింది. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Telangana: వీరికి ప్రాణసంజీవిని ఈ కంటైనర్ ఆసుపత్రి.. దేశంలోనే తొలి ఆవిష్కరణ..
Container Hospital
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 14, 2024 | 1:11 PM

Share

ఆ గిరిపుత్రులకు ఎంతటి ప్రమాదకర రోగం వచ్చినా చెట్ల పసర్లే శరణ్యం. గర్భిణీ స్త్రీలను సైతం మైళ్ళదూరం జోలెకట్టి మోసుకెళ్లిన దృశ్యాలు ఎన్నో చూశాం. అలాంటి మారుమూల గిరిజన బిడ్డల ఆయుష్షు పెంచడం కోసం మంత్రి సీతక్క ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన కంటైనర్ హాస్పిటల్స్ ప్రస్తుతం చర్చగా మారింది. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ కంటైనర్ హాస్పిటల్ అంటే ఏంటి.? వాటి విశిష్టతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అత్యవసర వైద్యం అందించేందుకు మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దినకర సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే ప్రప్రథమంగా కంటైనర్‌ హాస్పిటల్‌ను ములుగు జిల్లాలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎజెన్సీలోని గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు నడుంబిగించారు. ఏటా వర్షాకాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. గర్భిణీ స్త్రీలను సైతం అత్యవసర పరిస్థితుల్లో జోలె కట్టి తీసుకువచ్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి. పాము కాటుతో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. రవాణా సౌకర్యంలేక వైద్య సిబ్బందికి మారుమూల గ్రామాల్లోకి వెళ్లి గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతోంది. ఆలాంటి పరిస్థితులను అధిగమించి గిరిజనులకు వైద్య సేవలందించేందుకు మంత్రి సీతక్క చొరవతో ములుగు జిల్లా కలెక్టర్ ఓ వినూత్న ప్రయోగం చేశారు. కంటెయినర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోచాపూర్‎లో ఈ కంటైనర్ హాస్పిటల్‎ను ఏర్పాటు చేశారు.

పైలెట్ ప్రాజెక్టుగా పోచాపూర్‎లో ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పోచాపూర్ గ్రామానికి చుట్టూ నర్సాపూర్, అల్లిగూడెం, బందాల, బొల్లెపల్లి గ్రామాలకు ఈ వైద్య అందుబాటులోకి రానున్నాయి. దట్టమైన అడవిలోని మారుమూల గ్రామాలు, రోడ్డు రవాణా సరిగాలేని ఏజెన్సీ ప్రాంతంలో అత్యవసర వైద్యం అందించేందుకు సరికొత్త సాంకేతికతతో కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ దినకర అన్నారు. నాలుగు పడకల ప్రత్యేక గది గల కంటైనర్‎ను సుమారు రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఏ చిన్న పాటి జబ్బులు తలెత్తినా ఇందులో వైద్య చికిత్స అందిస్తారు. ఇందులో మందులతో పాటూ వైద్యపరీక్షలు జరిపే చిన్నపాటి ల్యాబులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రసవం సమయంలో గర్భిణిలు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయనవసరం లేకుండా ఈ కంటైనర్ హెల్త్ కేర్ యూనిట్లోనే చికిత్స అందిస్తారు. అవసరమైన శస్త్ర చికిత్స చేసేందుకు పరికరాలు కూడా అందుబాటులో ఉంచారు. విమర్శలు పక్కనపెట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే చక్కని ప్రతిపలం లభిస్తుందని అంటున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో ఇదే తరహాలో వైద్య సేవలు అందిస్తామని మంత్రి సీతక్క అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..