Watch Video: సినిమా స్టంట్‌ను మించిపోయిన రోడ్డు యాక్సిడెంట్.. చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తూరు వై జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వచ్చింది మరో వాహనం. భారీ పైపుల లోడుతో వస్తున్న వాహనం.. యూ టర్న్ తీసుకుంటున్న డీసీఎంను అధిగమించబోయి పక్కన రోడ్డులో వస్తున్న మరో లోడు లారీని ఢీ కొట్టింది.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తూరు వై జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వచ్చింది మరో వాహనం. భారీ పైపుల లోడుతో వస్తున్న వాహనం.. యూ టర్న్ తీసుకుంటున్న డీసీఎంను అధిగమించబోయి పక్కన రోడ్డులో వస్తున్న మరో లోడు లారీని ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు జాతీయ రహదారిపై వెళ్తున్న పత్తిలోడు వాహనాన్ని ఢీ కొట్టడంతో.. అటుగా వెళ్తున్న టూవీలర్ వాహనదారునిపై లోడు లారీ పడింది. స్కూటీ వెనుక భాగంలో కూర్చున్న వ్యక్తి తప్పించుకోగా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై లోడు లారీ పడి అక్కడికక్కడే చనిపోయాడు.
ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందంటున్నారు స్థానికులు. ఈ వీడియో మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భారీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పెంజర్ల గ్రామానికి చెందిన కందివనం అంజయ్యగా గుర్తించారు. మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




