Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seethakka: ఆ మహిళా ఫైర్ బ్రాండ్ మంత్రి ఎందుకలా ఫైర్ అయ్యారు..? ఎవరిపై ఆమె శాపనార్థాలు..?

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉగ్ర నరసింహా అవతారమెత్తారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై విష ప్రచారాలు చేస్తే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరిని హెచ్చరించారు.? ఎవరిపై శాపనార్థాలు పెట్టారు..? సీతక్క కు ఎందుకంత కోపం వచ్చింది..?

Seethakka: ఆ మహిళా ఫైర్ బ్రాండ్ మంత్రి ఎందుకలా ఫైర్ అయ్యారు..? ఎవరిపై ఆమె శాపనార్థాలు..?
Minister Seethakka
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Mar 27, 2024 | 11:49 AM

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉగ్ర నరసింహా అవతారమెత్తారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై విష ప్రచారాలు చేస్తే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరిని హెచ్చరించారు.? ఎవరిపై శాపనార్థాలు పెట్టారు..? సీతక్క కు ఎందుకంత కోపం వచ్చింది..? ఈ వార్త చదవాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఫైర్ బ్రాండ్‌గా, పాపులర్ మహిళ నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపున్న మంత్రి సీతక్క ఒకసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. కోపంతో ఊగిపోతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై శాపనార్థాలు పెట్టారు. కలమశం తెలియని తనపై విమర్శలు చేస్తే నాశనం అయిపోతారని ఆగ్రహంతో హెచ్చరించారు. సీతక్క ఆగ్రహానికి అసలు కారణం ఇదే… సీతక్కకు విపరీతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటుంది.. సీతక్కపై ఏ పోస్ట్ పెట్టినా ఫుల్ రేటింగ్ వస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫుల్ క్రేజ్.

అయితే సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు అదుపు తప్పింది. అదే సోషల్ మీడియా ఎక్కడ ఏం జరిగినా సీతక్కకు అంట కడుతూ విష ప్రచారాలు చేస్తున్నారట. ఎవరో చేసిన తప్పులను తనకు అంటకట్టి వ్యూస్ కోసం విష ప్రచారాలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట.

ఇటీవల మహబూబాబాద్‌లో ACB కి చిక్కిన మహిళా సబ్ రిజిస్ట్రార్‌తో తనకు సంబంధం అంటకట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో తన ప్రయివేట్ PA తనకు తెలియకుండా ఏదో ఫైరవీ చేస్తే వెంటనే తోగించి తన నిజాయితీని నిరూపించుకుంటే, అది కూడా తనకే అంట కట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. సొంత ఛానళ్ళు, యూట్యూబ్ లు పెట్టుకుని వ్యూస్ కోసం తన పై బురద జల్లతే నాశనం అవుతారని హెచ్చరించారు. ఇస్టానుసారంగా దుష్ప్రచారం చేసినవాళ్ళు బాగుపడి, బట్టకట్టరని ద్వజమెత్తారు..

దుర్మార్గపు దృషుప్రచారాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని..కచ్చితంగా ఆ ఆడబిడ్డ శాపం తగిలి నాశనమైపోతారని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలతో మా ఇమేజ్ దెబ్బతీయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించిన సీతక్క… ఇలాంటి కుట్రలు చేస్తే మీపార్టే బలవుతుందని బీఆర్ఎస్ నేతలకు హిత బోధ చేశారు. కవిత అంత దుర్మార్గపు స్కామ్‌లో ఉన్న ఒక ఆడకూతురుగా ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. కానీ నాలాంటి ఆడకూతురు నిజాయితీగా సేవచేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…