AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ పల్లెలను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు.. పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి సబితా

వెనకబడి పల్లెలను అన్ని గ్రామాలతో సమానంగా అభివృద్ధిలో పరుగు పెట్టించేందుకు పల్లెలో నిద్ర కార్యక్రమం.

కేసీఆర్ పల్లెలను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు.. పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి సబితా
Balaraju Goud
|

Updated on: Jan 26, 2021 | 6:43 AM

Share

Minister sabitha palle nidra : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వెనకబడి పల్లెలను అన్ని గ్రామాలతో సమానంగా అభివృద్ధిలో పరుగు పెట్టించేందుకు పల్లెలో నిద్ర కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి ప్రవేశపెట్టి పల్లెలను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని మాదాపూరు గ్రామంలో మంత్రి ‘పల్లె నిద్ర’ చేశారు.

అంతకు ముందు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీశారు మంత్రి. ‘రైతు బంధు’ అందుతుందా? పెన్షన్‌ వస్తుందా? కల్యాణ లక్ష్మీ వచ్చిందా? అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రి తమ గడపకు వచ్చి అప్యాయంగా పలకరించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌ కార్డులను మార్చి బడ్జెట్‌ అనంతరం మంజూరు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

అనంతరం గ్రామ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నేదునూరు, మాదాపూరు గ్రామాలను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, అందుకు భూములున్న ఎస్సీ రైతులకు భూమి చదును, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ కనెక్షన్‌, బోరు మోటార్లకు ఉచితంగా రుణాలను మంజూరు చేస్తామని తెలిపారు. రైతులకు ప్రతి సంవత్సరం ఎకరం భూమికి రూ. 10 వేలు, గుంట భూమి ఉన్న రైతు చనిపోతే రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ చైతన్యం కలిగిన గ్రామస్తులు గ్రామాభివృద్ధి కోసం భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.