Minister KTR: కేసీఆర్‌ లేకపోతే, తెలంగాణ రాకపోతే.. బీజేపీపై ఓరేంజ్‌లో మంత్రి కేటీఆర్‌ నిప్పులు..

కేసీఆర్ అనే మూడు అక్ష‌రాల ప‌దం లేక‌పోతే లేకపోతే.. తెలంగాణ రాకపోతే.. ఈ TPCC, TBJP ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. సంస్కారంతో ఆగుతున్నాం గానీ, తిట్టడం మొదలుపెడితే మా కంటే..

Minister KTR: కేసీఆర్‌ లేకపోతే, తెలంగాణ రాకపోతే.. బీజేపీపై ఓరేంజ్‌లో మంత్రి కేటీఆర్‌ నిప్పులు..
Minister Ktr
Follow us

|

Updated on: Apr 20, 2022 | 9:01 PM

కేసీఆర్ అనే మూడు అక్ష‌రాల ప‌దం లేక‌పోతే లేకపోతే.. తెలంగాణ రాకపోతే.. ఈ TPCC, TBJP ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. సంస్కారంతో ఆగుతున్నాం గానీ, తిట్టడం మొదలుపెడితే మా కంటే గొప్పగా నాలుకను ఎవరూ వాడలేరంటూ నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌(Minister KTR). హ‌నుమ‌కొండ‌లో టీఆర్ఎస్ పార్టీ(TRS) ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ‌కు అడుగడుగునా మోసం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, అమిత్‌షా, యోగి మొదలు రాష్ట్ర బీజేపీ నేతల వరకూ అందరిపై నిప్పులు చెరిగారు. కేంద్రానికి తెలంగాణ ఇస్తోంది ఎంత, కేంద్రం తిరిగి ఇస్తోందెంతో తేల్చాన్నారు.

హన్మకొండ సభలో లెక్కలతో సహా చెప్పేందుకు ప్రయత్నించారు మంత్రి కేటీఆర్‌. కాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్‌ సవాల్ విసిరారు. ఈ నాయకులు నోటికొచ్చిన‌ట్లు చిల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్న‌రు. మేం నోరు విప్పితే మా కంటే ఎవ‌రూ బాగా మాట్లాడ‌లేరని కేటీఆర్ తేల్చిచెప్పారు.

ఏడు మండ‌లాల‌ను గుంజుకుపోయి క‌లిపింది న‌రేంద్ర మోదీ కాదా? విద్యుత్ కొర‌త‌తో అల‌మ‌టించి పోతుంటే ఏడు మండ‌లాల్లోని లోయ‌ర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాలో క‌లిపింది ఈ బీజేపీ కాదా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్