KTR Warning: బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది జాగ్రత్త.. బీజేపీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..

KTR Warning: హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు చేసిన దాడిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

KTR Warning: బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది జాగ్రత్త.. బీజేపీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 31, 2021 | 8:18 PM

KTR Warning: హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు చేసిన దాడిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతల తీరును ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏమాత్రం చోటు లేదన్నారు. తెలంగాణలో రాణించాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని బీజేపీ నేతలకు హితవు చెప్పారు. బీజేపీ నేతల భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే.. బీజేపీ నేతలు కనీసం బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుందని తీవ్ర స్వరంతో మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

కాగా, హన్మకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వారు. అయితే తన ఇంటిపై దాడిని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఖండించారు. లెక్కలు అడిగితే ఇంటిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తానూ రామ భక్తుడినేనని ప్రకటించుకున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. తన స్వగ్రామంలో రామాలయం నిర్మించానని తెలిపారు. తాను ఇప్పటికీ మొదట చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని అన్నారు. బీజేపీ శ్రేణులు పార్టీ కండువాలు కప్పుకొని చందాలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also read:

విరాళాల విషయంలో వివాదం… ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడి… హన్మకొండలో ఉద్రిక్తత…

Vaccination To Journalists: జర్నలిస్టులకు కరోనా టీకా అందించాలని కేంద్రాన్ని కోరాం…మంత్రి ఈటల రాజేందర్…