MLA Challa Dharmareddy : హన్మకొండలో హై టెన్షన్.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై దుమారం..
దేవుడి మందిరం నిర్మాణానికి చేపట్టిన విరాళాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భగవంతుడు అందరి వాడంటూ...
MLA Challa Dharmareddy : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలతో హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మాణం కోసం బీజేపీ శ్రేణులు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ టాపిక్‌పైనే ధర్మారెడ్డి బీజేపీ పార్టీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు తమ పార్టీ కండువాలు కప్పుకొని చందాలు వసూలు చేస్తున్నారని…రాముడి పేరుని రాజకీయాలకు వాడుకుంటున్నారని …రాముడు బీజేపీ వాళ్లకే కాదు…అందరికి దేవుడంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టిన బీజేపీ నేతలు హన్మకొండలోని ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఆయన ఇంటిపై రాళ్లు, టమాటాలు, కోడి గుడ్లు విసిరారు. ఆందోళనకారుల దాడిలో ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. పరిస్థి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తన ఇంటిపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించారు ధర్మారెడ్డి. విరాళాలకు లెక్కా పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే నా ఇంటిపై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు ధర్మారెడ్డి. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాముడు బీజేపీ నేతలకే దేవుడు కాదని….భారతీయులందరికి ఆరాధ్య దైవమేనన్నారు ధర్మారెడ్డి.
హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటి పై జరిగిన దాడి ఖండిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు పరకాలలో ధర్నా నిర్వహించారు. బిజెపి దిష్టి బొమ్మ తగలబెట్టారు. బిజెపి నాయకుల దౌర్జన్యాలు అరాచకాలు నశించాలని నినాదాలు చేశారు.
ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి తప్పు పట్టారు. ఆయన ఓ కాంట్రాక్టర్ మైండ్ సెట్‌తో మాట్లాడుతున్నారని అన్నారు. ట్రస్ట్ ద్వారా రామ మందిరం నిర్మిస్తున్నారని.. అయోధ్య నుంచి వచ్చిన బుక్కుల ద్వారానే విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. విరాళాల సేకరణను కూడా రాజకీయ చేయడం దుర్మార్గమన్నారు.
రాజకీయాల్లోకి దేవుడ్ని లాగడం..కానుక రూపంలో డబ్బులు కాజేయడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారనేది ఎమ్మెల్యే ధర్మారెడ్డి వాదన. కాదు దేవుళ్లకు కూడా ప్రాంతీయతత్వం అంటగట్టి..టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లబ్ధి పొందాలని చూస్తున్నారనేది బీజేపీ నేతల ఆరోపణ. ఈ వివాదం ఇంకా ఏలాంటి పరణామాలకు దారి తీస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..