KTR: ఈటలకు జరిగిన అన్యాయం ఏంటో.. మాజీ మంత్రి రాజేందర్‌పై తొలిసారిగా స్పందించిన మంత్రి కేటీఆర్
ఈటల రాజేందర్ వ్యవహారంలో తొలిసారిగా స్పందించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎంత ఇచ్చిందో, ఏమి చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
Minister KTR Media Chit Chat: ఈటల రాజేందర్ వ్యవహారంలో తొలిసారిగా స్పందించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎంత ఇచ్చిందో, ఏమి చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలన్నారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ ఆత్మవంచన చేసుకుంటున్నారని కామెంట్ చేశారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో పోటీ వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్యేనని స్పష్టం చేశారు కేటీఆర్. ఇంకోవైపు జల వివాదాల్లో న్యాయమే గెలుస్తుందని, ఏపీ ఎన్ని కేసులు వేసినా న్యాయబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు కేటీఆర్. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదని తెలిపారు. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పార్టీల మధ్యనే పోటీ గానీ.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
Read Also.. Chandrababu: ఎన్నికల్లో కలిసి పని చేశారు.. కృష్ణా నీటి కోసం కలవలేరా..? ఇద్దరు సీఎంలకు చంద్రబాబు ప్రశ్న