KTR: ‘పైసా ఇవ్వను మందు పోయను, మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా’.. కేటీఆర్ కామెంట్స్..
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట వెళ్లారు...

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట వెళ్లారు. ఎల్లారెడ్డిపేటలో నిర్మించిన పాఠశాల సముదాయ భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ పాఠశాలను ప్రభుత్వం రూ. 8 కోట్లతో నిర్మించారు.
పాఠశాల సముదాయ భవనాలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలంగాణ ప్రజలు కలుస్తుంటారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఎంతో మంది అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తున్నారు. వారంతా ఆ స్థాయికి చేరుకోవడానికి మన టీచర్లే కారణం. 9 ఏళ్ల క్రితం మన బడులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉందో, భూముల ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడెలా ఉన్నాయి లాంటి విషయాలను ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల కచ్చితంగా వస్తుంది. ఇంకా చేయాల్సిన పనిచాలా ఉంది. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధి సరిగ్గా ఉందా లేదా అన్నదే ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ’50 ఏళ్లలో ఏ పనులు చేయని వారు ఇప్పుడొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని కాదని కానీ చిన్న చిన్న పనులను పట్టుకుంటున్నారు. కరీనంగర్ ఎంపీతో అరపైసా న్యాయం జరగలేదు. మీ దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా.. వచ్చి పనిచేస్తా. నేను ఎన్నికల్లో మందు పోయను, పైసలు ఇవ్వననే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు.? అలాగే ఉంటే. నాకు ప్రజల మీద విశ్వాసం. పనిచేశాను, పనిచేస్తాను కాబట్టి ప్రజలు కోరుకున్నాన్ని రోజులు సిరిసిల్లలోనే ఉంటా. మీ కోసం పనిచేస్తా’ అని చెప్పుకొచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
