Rain Alert: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్‌.. వచ్చే మూడు రోజుల పాటు..

వర్షాల సమయంలో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని.. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వర్షం కురిసేటప్పుడు బయట ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో.. వచ్చే 3 రోజులు పక్కా వర్షాలు ఉంటాయని.. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయన్నది..

Rain Alert: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్‌.. వచ్చే మూడు రోజుల పాటు..
Rain Alert
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jul 12, 2024 | 4:42 PM

తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ కుమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

వర్షాల సమయంలో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని.. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వర్షం కురిసేటప్పుడు బయట ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో.. వచ్చే 3 రోజులు పక్కా వర్షాలు ఉంటాయని.. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయన్నది వెదర్ డిపార్టుమెంటు లేటెస్ట్ రిపోర్ట్. ఇక నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి అని తెలిపింది. ఇక గురువారం రాత్రి తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. హైదరాబాద్ సిటీలోను చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి రైతులు, కాపరులు చెట్ల కింద ఉండకూడదని అధికారులు హెచ్చరించారు. ఇక హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కరెంట్ స్తంభాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, హోర్డింగ్స్‌ సమీపంలో సంచరించకుండా ఉండడం బెటర్‌ అని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..