Medaram 2.O: కోట్లాది భక్తులకు కొంగు బంగారం.. శిలాక్షరాలుగా సమ్మక్క సారలమ్మ చరితలు
Medaram Sammakka Saralamma Jathara: మేడారం చరిత్ర దాదాపు వెయ్యేళ్ల నాటిది. అలాంటి ఘన చరిత్రకు ఆధునిక హంగులు అద్దింది తెలంగాణ ప్రభుత్వం. గిరిజనుల మనోభావాలకు తగ్గట్టుగా, ఆదివాసీల నమ్మకాన్ని ప్రతిబింబించేలా రాతి ప్రాకారాలతో, శిలాతోరణాలతో తీర్చిదిద్దింది సర్కార్. కోయ తెగల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతూ, జాతరకు వచ్చిన వాళ్లందరికీ వనదేవతల ప్రాశస్త్యం తెలియజేసేలా తెల్లరాతి స్తంభాలతో సిద్ధమైంది మేడారం.

మేడారం కేవలం తెలంగాణకు పరిమితమైన జాతర కాదు. తెలుగు వారికే సుపరిచితం అనుకుంటే పొరపాటు. దేశనలుమూలల్లోని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఆదివాసీ గూడేలకు సైతం దశాబ్దాలుగా తెలిసిన దైవం. ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆల్ ఇండియా సర్వీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న IAS, IPS, IFS అధికారులు తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రాంతం మేడారం. కాదు.. ఆల్ ఇండియా సర్వీస్ ట్రైనింగ్‌లో మేడారం ఒక ప్రత్యేక పాఠం. కంపల్సరీగా ఆ జాతర డ్యూటీకి రావాల్సిందే, తమ ట్రైనింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిందే. అంతటి విశేషం ఉంది ఈ మేడారం జాతరకి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ముందు తరాలకు ఆ ఆదివాసీ జాతర విశేషాలను శాశ్వతంగా మిగిల్చేలా.. మేడారానికి ఒక కొత్త రూపు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం వంద రోజుల్లోనే ఒక అద్భుతాన్ని సృష్టించింది. గిరిజనులు కోరుకున్న విధంగా మేడారం ప్రాంతాన్ని పునర్నిర్మించింది. అడవే ఆరాధన స్థలం. కుంకుమ భరిణలే దేవతలు. అక్కడి గద్దెలే భక్తులకు వరాలిచ్చే కొంగు బంగారాలు. ఇక్కడేమీ విగ్రహాలు ఉండవు. వేద సంప్రదాయరీతి పూజలు కనిపించవు. అదసలు గుడి కాదు. ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చే మహిమాన్విత స్థలం. సింపుల్‌గా ఒక ఓపెన్ టెంపుల్. గుళ్లు, మండపాలు, ఆగమ శాస్త్ర అర్చనలు గట్రా ఉండవు. కొబ్బరికాయ, బెల్లం, బలి. ఇదే అక్కడ పద్దతి. అదే మేడారం. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); మేడారం చరిత్ర దాదాపు వెయ్యేళ్ల నాటిది. అలాంటి ఘన చరిత్రకు ఆధునిక...
