దొంగలు బాబోయ్ దొంగలు..! ఘట్కేసర్‌లో పట్టపగలే భారీ చోరీ..
గుడ్ ఫ్రై డే సంద్భంగా రాములు కుటుంబం చర్చికి వెళ్లింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి మెయిన్ డోర్ తాళలు పగలగొట్టి కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. ఘట్కేసర్, ద్వారక నగర్‌లోని రాములు అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. రాములు ఇంట్లో మిట్ట మధ్యాహ్నం చోరీ జరిగింది. గుడ్ ఫ్రై డే సంద్భంగా రాములు కుటుంబం చర్చికి వెళ్లింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి మెయిన్ డోర్ తాళలు పగలగొట్టి కనిపించింది. అది చూసిన కంగుతిన్న రాములు.. ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్టు అర్ధమైంది.
రాములు, అతని కుటుంబ సభ్యులు ఇంట్లోకి పరిగెత్తి చూడగా బీరువా తాళాలు పగల గొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 9 లక్షల రూపాయలు, 15 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో లబోదిబోమంటూ..రాములు పోలీసులను ఆశ్రయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..