దారుణం.. పానీపూరి తినలేదని వృద్ధురాలిని చంపేసిన మహిళ..
పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్, ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త శకుంతలా దేవిని హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శీతల్, మధు, మీనాక్షి, షాలులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని షాహదారా జిల్లా జీటీబీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో పానీపూరీ తినలేదని వృద్ధురాలిని కొట్టడంతో ఆమె మృతి చెందింది. బాధితురాలు పానీపూరి తినడానికి నిరాకరించడంతో ఆమె తన ఇరుగుపొరుగు మహిళలతో గొడవకు దిగింది. గొడవలోనే ఒక వృద్ధురాలిని తోసేసింది. దాంతో మహిళ తలకు తీవ్రమైన గాయం కావడంతో..ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వృద్ధురాలు శకుంతలా దేవి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు మహిళలపై మృతురాలి కోడలు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
స్థానికంగా నివాసముంటున్న శీతల్ అనే మహిళ పానీపూరి తయారు చేసింది. ఆమె చేసిన పానీపూరి తినమని పొరుగు వారిని కోరగా శకుంతలా దేవి నిరాకరించింది. దీంతో ఆగ్రహనికి గురైన మహిళ..వారితో గొడవకు దిగింది. ఇంతలో శీతల్ తల్లి, ఇద్దరు కోడలు కూడా వచ్చారు. నలుగురూ కలిసి శకుంతలను కొట్టడం మొదలుపెట్టారు. గొడవ జరుగుతుండగా,శకుంతల కిందపడిపోయింది. దాంతో అక్కడికక్కడే మృతిచెందింది. శకుంతలా దేవి హార్ట్ పేషెంట్ అని తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఖేడా విలేజ్‌లోని స్ట్రీట్ నెం-7లో ఈ ఘటన జరిగింది. శకుంతలాదేవికి ముగ్గురు కొడుకులు. అవధేష్ కుమార్, సుభాష్, రాజేష్. నిందితురాలు శీతల్ కుటుంబం పొరుగున నివసిస్తోంది. కొడుకు రాజేష్ భార్య శకుంతలను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్, ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త శకుంతలా దేవిని హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శీతల్, మధు, మీనాక్షి, షాలులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..