AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ట్రైన్‌కు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అది.. తిరుపతి వెళ్లే రైలు వేగంగా దూసుకు వస్తోంది.. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి బైక్ తో రైలు పట్టాలపైకి ఎంట్రీ ఇచ్చాడు.. ద్విచక్రవాహనంతో రైలుకు ఎదురుగా ప్రయాణిస్తున్నాడు.. ఇదే సమయంలో గేట్ కీపర్ బైకర్ ను చూశాడు..

Telangana: ట్రైన్‌కు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Train Incident
Diwakar P
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 05, 2024 | 1:07 PM

Share

అది.. సాయినగర్ ఎక్స్‌ప్రెస్.. రైలు వేగంగా దూసుకు వస్తోంది.. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి బైక్ తో రైలు పట్టాలపైకి ఎంట్రీ ఇచ్చాడు.. ద్విచక్రవాహనంతో రైలుకు ఎదురుగా ప్రయాణిస్తున్నాడు.. ఇదే సమయంలో గేట్ కీపర్ బైకర్ ను చూశాడు.. వెంటనే ఈ సమాచారాన్ని ట్రైన్ పైలట్ కు అందించాడు.. దీంతో సరిగ్గా ఆ వ్యక్తి రైలుకు ఎదురుగా వచ్చే సమయానికి ట్రైన్ ను నిలిపివేశారు. దీంతో అతని ప్రాణాలు దక్కాయి.. ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం దర్యపూర్‌ రైల్వేగేట్‌ దగ్గర చోటు చేసుకుంది. నవీపేట మండలం దర్యపూర్‌ రైల్వేగేట్‌ సమీపంలో ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ద్విచక్రవాహనంపై దూసుకెళ్లాడు. ఈ క్రమంలో.. అతన్ని గేట్‌ కీపర్‌ గమనించాడు.. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి ట్రైన్ పైలట్ కు సమాచారం అందించాడు.. దీంతో రైలును ఆపారు.

వీడియో చూడండి..

ట్రైన్ ను ఆపడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం నిలబడింది. ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే నిలిపేశారు. అనంతరం ఆర్పీఎఫ్‌ పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం నిజామాబాద్‌ కార్యాలయానికి తరలించారు.. ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తిని జగదీష్ గా గుర్తించారు.. జగదీష్ నవిపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు.. ఆయన సొంత గ్రామం నిజామాబాద్ జిల్లా భీంగల్ అని.. ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన జగదీష్ తన భార్యతో కలహాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆయనపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు.. రైల్వే ట్రాక్లపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.. బైక్ ట్రైన్ కింద పడి ఉంటే రైలు కూడా ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఉండేదని, ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల రైల్వే ట్రాక్ లపై ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. మరోవైపు కొంతమంది పోకిరిలు రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..