AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు!

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. వేగంగా మంటలు వ్యాపించడంతో వార్డులలో నుంచి బ సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు!
Fire Breaks Out In Hyderabad Nims Hospital
Balaraju Goud
|

Updated on: Apr 19, 2025 | 7:35 PM

Share

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. వేగంగా మంటలు వ్యాపించడంతో వార్డులలో నుంచి బ సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రాణనష్టం, క్షతగాత్రులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఈ ఘటనపై నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. నిమ్స్ ఎమర్జెన్సీ బిల్డింగ్‌ ఐదో అంతస్తులో ఆడిటోరియం వద్ద (నాన్ పేషెంట్ ఏరియా) షార్ట్ సర్క్యూట్ జరిగిందని తెలిపింది. పొగలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, మంటలు అంటుకోకుండా చర్యలు తీసుకున్నారు. అక్కడెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అస్తి నష్టం కూడా జరగలేదని పేర్కొంది. ఈ అంశంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప గారితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..