Adibatla Kidnap Case: నేను చేసింది తప్పే.. నా బాధను అర్థం చేసుకోండి.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన నవీన్ రెడ్డి

తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఉన్మాదిగా  మారిన నవీన్ రెడ్డి వందమందితో కలిసి ఇంటి పై దాడి చేసిన వైశాలి తల్లిదండ్రులను గాయపరిచి ఆమెను కిడ్నప్ చేశాడు.

Adibatla Kidnap Case: నేను చేసింది తప్పే.. నా బాధను అర్థం చేసుకోండి.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన నవీన్ రెడ్డి
Naveen Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2022 | 10:39 PM

సంచలనం సృష్టించిన వైశాలి అనే యువతీ కేసులో రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది. వందమందితో కలిసి నవీన్ అనే యువకుడు వైశాలి ఆమె అమ్మాయిని కిడ్నప్ చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఉన్మాదిగా  మారిన నవీన్ రెడ్డి వందమందితో కలిసి ఇంటి పై దాడి చేసిన వైశాలి తల్లిదండ్రులను గాయపరిచి ఆమెను కిడ్నప్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని పోలీసులు కాపాడారు కానీ నిందితుడు నవీన్ రెడ్డి తప్పించుకున్నాడు. తాజాగా నవీన్ ను గోవాలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే నవీన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. నా బాధను అర్ధం చేసుకోండి అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.

సెల్ఫీ వీడియోలో నవీన్ మాట్లాడుతూ.. నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నా..నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో  నా బాధను అర్థం చేసుకోండి. బ్యాడ్మింటన్ కోర్టులో నాకు వైశాలీ పరిచయం అయ్యింది. ఆ సమయంలో ఆమెతో పరిచయం పెరిగింది. 6-7 వారాల తర్వాత పెళ్లి చేసుకుందామని అడిగాను. ఈ ఎపిసోడ్‌లో అంతా నాదే తప్పంటున్నారు… ఇదే అమ్మాయికి జరిగితే ఇలాగే తప్పుపడతారా.?ఈ ఘటనను ఓ ఫ్యామెలీకి సంబంధించిన ఇష్యూగా చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.

కిడ్నాప్ తర్వాత గోవాకు పారిపోయిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డితోపాటు ఏ-6 ఉన్న చందుని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం కిడ్నాప్ తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారు..? పరారీలో ఉన్న మిగతా నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు. వైశాలి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. పరిచయం దగ్గర్నుంచి కిడ్నాప్‌ వరకు ప్రతీ ఇన్సిడెంట్‌నీ సీన్‌ టు సీన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు పోలీసులు. వైశాలికి, నవీన్‌రెడ్డికి అసలెలా పరిచయం?. కిడ్నాప్‌కి దారితీసిన పరిణామాలన్నీ క్లియర్‌గా కోర్టుకు నివేదించారు. ఆ రిమాండ్‌ రిపోర్ట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.