BJP Candidates: కమలం పార్టీలో కొత్త ట్విస్ట్‌.. కేడర్‌నుంచి ఒత్తిడి ఉందా..అభ్యర్థులను మారుస్తారా?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసుకుని ప్రచార రంగంలో తలమునకలయ్యాయి. కానీ పలు స్థానాల్లోఅభ్యర్థుల మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. అందరికంటే ముందే క్యాండిడేట్స్‌ను ఖరారు చేసిన బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తోందట. ఇంతకీ అంతలా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకొచ్చింది..? ఏ స్థానాల్లో అభ్యర్థులు ఫిట్ అవడం లేదు..?

BJP Candidates:  కమలం పార్టీలో కొత్త ట్విస్ట్‌.. కేడర్‌నుంచి ఒత్తిడి ఉందా..అభ్యర్థులను మారుస్తారా?
Bjp
Follow us

|

Updated on: Apr 17, 2024 | 3:33 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసుకుని ప్రచార రంగంలో తలమునకలయ్యాయి. కానీ పలు స్థానాల్లోఅభ్యర్థుల మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. అందరికంటే ముందే క్యాండిడేట్స్‌ను ఖరారు చేసిన బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తోందట. ఇంతకీ అంతలా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకొచ్చింది..? ఏ స్థానాల్లో అభ్యర్థులు ఫిట్ అవడం లేదు..?

తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్‌తో ముందుకెళ్తోంది కమలదళం. సుదీర్ఘ కసరత్తు తర్వాత బలమైన అభ్యర్థులతో జాబితాలు విడుదల చేసింది. అయితే ఇందులో రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ప్రకటించిన అభ్యర్థుల తీరుతో కూడా మార్పు అనివార్యమయ్యేలా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్దపల్లి క్యాండేట్‌పై పార్టీ హైకమాండ్‌ పునరాలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఖమ్మం, నల్గొండ లోక్ సభ అభ్యర్థులను కూడా మారుస్తారంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రజాదరణ ఉన్నవారు, బలమైన నాయకులను ఎన్నికల బరిలోకి దించాలని ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది కమలంపార్టీ. కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నేతలను చేర్చుకుని మరీ పదిహేడు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లిలో కూడా కాస్త స్ట్రాంగ్ లీడర్ కావాలని కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్‌ని చేర్చుకుని టికెట్‌ ఇచ్చింది. ఆయన ఇప్పటిదాకా ఆయన పెద్దగా ప్రచారం చేసినట్లు కానీ, పార్టీ శ్రేణులను కలిసిన దాఖలాలు కానీ లేవు. టికెట్ ఇచ్చినా ఆయన గడపదాటటం లేదని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ గోమాస ఇదే తరహాలో ఇతర పార్టీల్లో కూడా టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చునేవారని అక్కడి నేతలు అంటున్నారు. స్థానిక నేతలను కలుపుకుని పోవడం లేదని.. మోదీ హవా, పార్టీ సానుకూలతను వాడుకోవడం లేదని గోమాస శ్రీనివాస్‌పై ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. దీంతో పెద్దపల్లి టికెట్ మార్చే అవకాశం ఉందని.. గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారట!

ఖమ్మం, నల్గొండ అభ్యర్థులను సైతం మారుస్తారంటూ కమలం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే నల్గొండ లోక్ సభ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి కలిసొచ్చిన నేతలతో ప్రచారం సాగిస్తున్నారు. స్థానికంగా బీజేపీ నేతలు కొంత వ్యతిరేకిస్తున్నా .. ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నల్గొండ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం అభ్యర్థి మార్పుపై కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. టికెట్ ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకట్రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న తాండ్ర వినోద్ రావు కు స్థానికంగా సానుకూల పరిస్థితులు లేవని.. క్యాండిడేట్‌ని మార్చాలని పార్టీ శ్రేణులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో వినోద్ రావు అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అభ్యర్థి మార్పు ఉంటే జలగంకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

సిట్టింగ్‌ సీటు ఆదిలాబాద్‌ విషయంలోనే పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్‌కి టికెటి ఇవ్వడాన్ని ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీంతో ఆదిలాబాద్‌ సీటుపైనా పార్టీలో డిస్కషన్‌ నడుస్తోందంటున్నారు. ప్రచారాన్ని ఉధృతం చేసి బీఫాంలు తీసుకోవాల్సిన టైంలో ఒకరిద్దరు క్యాండేట్స్ టికెట్ మారుస్తారన్న ప్రచారంపై బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఖమ్మం, నల్గొండ విషయంలో అంత తీవ్రత లేకున్నా.. పెద్దపల్లి సీటు మార్పుపై మాత్రం సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. క్యాండేట్‌ని మార్చే ఛాన్స్ ఉంటే BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీలోచేరి ఆయనే అభ్యర్థి అవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..