Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్

ఈసారి సండే మాత్రం నాన్ వెజ్ లవర్స్‌కి కష్టతరమైన రోజు. ఎందుకంటే ఈసారి ఆదివారం మాంసాహారం విక్రయాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకు కారణం..  మహావీర్ జయంతి. దీంతో.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కబేళాలు, రిటైల్‌ మాంసం దుకాణాలను బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు.

Hyderabad:  నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్
Mutton Shop
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 17, 2024 | 4:00 PM

మాంసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. అవును… ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే. చికెన్‌, మటన్‌, ఫిస్‌.. వారికి నచ్చిన మీట్ కోసం షాపుల ముందు క్యూ కడతారు. సాధారణంగా ఆదివారం పూట చాలా ఇళ్లల్లో మాంసం వంటకాల గుమగుమలు గుబాళిస్తుంటాయి.  ప్రతీ ఆదివారం ముక్క రుచి చూడనిదే కొందరు అస్సలు ఉండలేకపోతుంటారు. వర్క్ హాలిడే, జాబ్ హాలిడే… సండే స్పెషల్ అంటే.. చికెన్, మటన్ కూడా చాలామందే ఉన్నారు. అయితే, ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం దొరకదు. ఎందుకంటే.. ఈ నెల 21న సిటీలోని మటన్ షాపులతో పాటు కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్స్ క్లోజ్‌ చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్.. ఈ మేరకు ఉత్వర్వుల జారీ చేశారు.  జైనులు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ నేపథ్యంలోనే మహావీరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు GHMC కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా నాన్ వెజ్ షాపులు ఓపెన్ చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో, ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని రోనాల్డ్ రోస్ GHMC పరిధిలోకి వచ్చే మూడు పోలీసు కమిషనరేట్‌లను అభ్యర్థించారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…