Hyderabad: 13 ఏళ్ల బాలికకు ఇన్ స్టాలో పరిచయమైన 19 ఏళ్ల యువకుడు.. సీన్ కట్ చేస్తే..
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిందో బాలిక. ఇన్‌స్టా బాయ్ ఫ్రెండ్ కోసం ఇంటినే దోచేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడాంది. ఇంట్లో తరుచుగా డబ్బులు కనిపించకుండా పోతుండటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
అక్కున్న చేర్చుకుని.. చదివిస్తున్న పెదనాన్న ఇంటికే కన్నం వేసింది ఓ బాలిక. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి కోసం.. ఆ ఇంట్లోని బంగారం, డబ్బు విడతల వారీగా చోరీ చేసింది. ఆపై తనకేం తెలియనట్లు ఎంచక్కా స్కూల్‌కు వెళ్తుంది. ఇంట్లో అడపా దడపా డబ్బులు మిస్ అవ్వడంతో.. ఆరా తీయగా అసలు విషయం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాలోని జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు.. నగరంలోని చిలకలగూడలో ఉంటూ జాబ్ చేస్తున్నాడు. అతడి మరదలి కూతుర్ని(13) కూడా వారి వద్దే ఉంచుకుని స్థానికంగా ఉన్న స్కూల్లో చదివిస్తున్నారు.
అయితే ఇన్ స్టా ఎక్కువగా యూజ్ చేసే బాలికకు.. కడప జిల్లా పెంట్లమర్రి మండలం వేలూరుపాడుకు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి (19) ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. బెంగళూరులో డిగ్రీ చదవుతున్న విజయ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఇన్‌స్టాలో అర్జున్‌రెడ్డి పేరుతో.. లవ్ చేస్తున్నానంటూ బాలికను నమ్మించాడు. ఆ బాలికది తెలియని వయస్సు కావడంతో అతడికి అట్రాక్ట్ అయింది. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి డబ్బు గుంజడం స్టార్ట్ చేశాడు. దీంతో పెద్దనాన్న ఇంట్లో బంగారం, డబ్బు చోరీ చేసిన బాలిక దశలవారీగా 16 తులాల ఆభరణాలు, లక్షన్నర నగదు.. మొత్తం 13 లక్షల సొత్తును అతడికి చేర్చింది.
ఓ రోజు శ్రీనివాస్‌రావు జేబులో పెట్టుకున్న రూ.3 వేలు మిస్ అయ్యియి. బాలిక ప్రవర్తనపై అనుమానం కలిగి ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పింది. ఇంట్లోని బీరువాలో చూడగా.. 16 తులాలం బంగారం, రూ. 1.50 లక్షల నగదు, కనిపించలేదు. బాలిక ఫోన్ చెక్ చేయగా.. విజయ్‌కుమార్ వ్యవహారం బయటపడింది. ఆన్‌లైన్‌లోనే అతడికి మనీ సెండ్ చేసినట్లు.. బంగారం తన క్లాస్‌మేట్ తల్లి సాయంతో కుదవపెట్టి డబ్బులు పంపించినట్లు వెల్లడైంది. దీంతో శ్రీనివాసరావు చిలకలగూడ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విజయ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..