Hyderabad: వామ్మో.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఫుట్‌బోర్డ్‌పై నిల్చొని ప్రాణాలు కాపాడుకున్న బైకర్.. షాకింగ్ వీడియో..

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది.. ఓ లారీ డ్రైవర్ బైకర్ ను ఢీకొట్టి దాదాపు రెండు కిలో మీటర్లపాటు ఈడ్చుకెళ్లాడు.. లారీ బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ లోని చంపా పేట ప్రధాన రోడ్డుపై చోటుచేసుకుంది. లారీ బైక్‌ను ఢీకొట్టి రెండు కిలో మీటర్లపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. అనంతరం మరో కార్‌ను ఢీకొట్టింది. అయితే, ద్విచక్రవాహనదారుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు. 

Hyderabad: వామ్మో.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఫుట్‌బోర్డ్‌పై నిల్చొని ప్రాణాలు కాపాడుకున్న బైకర్.. షాకింగ్ వీడియో..
Accident
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 17, 2024 | 3:41 PM

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది.. ఓ లారీ డ్రైవర్ బైకర్ ను ఢీకొట్టి దాదాపు రెండు కిలో మీటర్లపాటు ఈడ్చుకెళ్లాడు.. లారీ బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ లోని చంపా పేట ప్రధాన రోడ్డుపై చోటుచేసుకుంది. లారీ బైక్‌ను ఢీకొట్టి రెండు కిలో మీటర్లపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. అనంతరం మరో కార్‌ను ఢీకొట్టింది. అయితే, ద్విచక్రవాహనదారుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ఈదీ బజార్‌కు చెందిన వ్యాపారి అబ్దుల్ మజీద్ (60 ) అర్ధరాత్రి తన టూ వీలర్ పై చంపాపేట్ లక్ష్మీ గార్డెన్ దగ్గర వెళుతుండగా వెనుకవైపు నుంచి వచ్చిన లారీ (AP 39VC 976) అకస్మాత్తుగా ఢికొట్టింది. అయితే, బైక్‌ లారీ కిందకు వెళ్లగా.. బైకర్ మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. లారీ డోర్ పట్టుకుని.. కొంత దూరం వరకు అలానే వెళ్లిపోయాడు.. ఫుట్‌బోర్డ్ పై ఉండటంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం చంపాపేట్ టి-జంక్షన్ వద్ద అదే లారీ (టిఎస్ 07యుఎన్ 2580) గల మరో కారును కూడా ఢీకొట్టి ధ్వంసం చేసి ఆగకుండా వెళ్లి పోయింది.

అయితే, బైకర్ రెండు కిలోమీటర్ల పాటు లారీ ఫుట్‌బోర్డ్ దగ్గర నిలబడి ఆపాలంటూ అర్తనాదాలు చేశాడు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో లారీ డ్రైవర్ బ్రేకులు వేయగా అప్పుడు కిందకు దిగాడు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెండు కిలోమీటర్ల పాటు ఫుట్‌బోర్డ్ పై బైకర్ నిలబడ్డాడు. ఈ సమయంలో లారీని పట్టుకుని బైకర్‌ వెళ్తుండగా.. అటుగా వస్తున్న కారు డ్రైవర్.. ఈ వీడియోను రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.

వీడియో చూడండి..

అయితే, వీడియో ఆధారంగా లారీ డ్రైవర్ ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లారీని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సంపద సృష్టికి SIP ఒక సరైన పద్దతి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
సంపద సృష్టికి SIP ఒక సరైన పద్దతి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
తెలుగులోకి ప్రేమలు బ్యూటీ.. ఆ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిందా.?
తెలుగులోకి ప్రేమలు బ్యూటీ.. ఆ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిందా.?
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్