Leopard Attack: మళ్లీ పంజా విసిరిన చిరుతపులి.. లేగదూడపై దాడి.. కన్నీరు పెట్టించిన తల్లి ఆవు ఆర్తనాదాలు..
Leopard Attack: ములుగు జిల్లా ఏజెన్సీని చిరుతపులి షేక్ చేస్తుంది. పశువులను బలి తీసుకుంటున్న ఆ చిరుత పరిసర గ్రామాల
Leopard Attack: ములుగు జిల్లా ఏజెన్సీని చిరుతపులి షేక్ చేస్తుంది. పశువులను బలి తీసుకుంటున్న ఆ చిరుత పరిసర గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చిరుత పంజాకు పశువులు బలవుతుండడంతో అటవీశాఖ సిబ్బంది అన్వేషణ ముమ్మరం చేసింది. చిరుత సంచారం శుభపరిణామం అంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. పశువుల కాపర్లు, పర్యాటకులు అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు.
అయితే, ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతాల వద్ద కొద్ది రోజుల క్రితం చెట్టుపై ప్రత్యక్షమైన చిరుత గత 15రోజుల నుండి ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. జన సంచారం చూసి చెట్టు దిగి సమీప అడవుల్లోకి పారి పోయింది. చెట్టు మీదినుండి దూకి అడవిలోకి ప్రవేశించిన చిరుత వాజేడు, వెంకటాపురం మండలాలను వణికిస్తుంది. రోజుకోచోట అడవిలో మేతకు వెళ్లిన పశువులను బలి తీసుకుంటుంది. మంగళవారం ఉదయం దూలపురం వద్ద ఓ లేగదూడను హతమార్చింది. ఆ దూడ తల్లి ఆవు అంబా అని రోదిస్తూ లేగ దూడ కోసం గాలిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలు చెలించిపోయేలా చేసింది. ఈ తల్లి ఆవు తపన చూసి అటవీశాఖ అధికారులు స్పందించారు. చిరుత కోసం వేట ముమ్మరం చేశారు. పాద ముద్రల ఆధారంగా చిరుత సంచరించిన ప్రదేశాలను గుర్తించారు. వాజేడు మండలంలోని కొంగాల-దూలపురం, సుందరయ్య కాలనీ, ఇప్పగూడెం, గుమ్మడిదోడ్డి పరిసర గ్రామాల్లో చిరుత కోసం గాలిస్తున్నారు.
ఇక తీవ్ర భయాందోళనలో ఇక్కడి ప్రజలు చిరుత నుండి ఆత్మరక్షణ కోసం కత్తులు, కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలు హడలెత్తిపోయేలా చేస్తున్న చిరుత ఇప్పటివరకు అడవిలోనే మాటువేసి దాడులు చేస్తుంది. అదృష్టవశాత్తు ఎక్కడా గ్రామాలపై, ప్రజలపై దాడికి పాల్పడిన సందర్భంలేదు. అయితే చిరుతతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక ప్రజలకు సూచిస్తున్నారు అటవీశాఖ సిబ్బంది. ప్రజలు ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను అడవిలో మేతకు తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు. మరోవైపు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చిరుత కోసం వేట ముమ్మరంగా కోనసాగిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Also read:
Bharat Bandh: 26 న భారత్ బంద్ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ పాటించాలని రైతు సంఘాల పిలుపు