Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Bandh: 26 న భారత్‌ బంద్‌ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్‌ పాటించాలని రైతు సంఘాల పిలుపు

Bharat Bandh: కేంద్ర తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులు రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో వైపు వ్యవసాయ చట్టాల

Bharat Bandh: 26 న భారత్‌ బంద్‌ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్‌ పాటించాలని రైతు సంఘాల పిలుపు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 10, 2021 | 8:49 PM

Bharat Bandh: కేంద్ర తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులు రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో వైపు వ్యవసాయ చట్టాలలో అవసరం అనుకుంటే మార్పులు చేస్తాము తప్ప.. రద్దు చేసేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవసాచ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో అలు పెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్‌ బంద్‌ చేపట్టనున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఈ తేదీ నాటికి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్‌ తెలిపారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాలు తెలిపాయి. అలాగే పెరిగిన చమురు ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15న ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. మార్చి 29న దహన్‌పేరిట వ్యవసాయ చట్టాల ప్రచుతలను దగ్ధం చేయనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేలతో వరుసగా చర్చలు జరిపింది. అయినా రైతులు ఏ మాత్రం తగ్గడం లేదు. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని పట్టుబడుతున్నారు.

ఇవి చదవండి :

రైతుల ఆందోళనపై బ్రిటిష్ ఎంపీల చర్చ, భారత్ ఖండన, అంతర్గత వ్యవహారమని వ్యాఖ్య

Onion Price Reduced: దిగి వస్తున్న ఉల్లిపాయ ధర.. ఏడు రోజుల్లో 21 రూపాయలు తగ్గిన ఉల్లి

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!