చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

Telangana: చుట్టూ నీళ్లు..మధ్యలో బస.. సినిమాల్లో కనిపించే అలాంటి సీన్ రియల్‌గా కళ్లముందు కనిపిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది కాదూ.. ఆ ఊహను నిజం చేసేలా.. పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం ముస్తాబైంది..

చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?
Laknavaram Reservoir
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 28, 2024 | 8:59 AM

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మూడో ద్వీపం (ఐలాండ్) రెడీ అయింది. సముద్ర దీవుల్లో ఉండే విధంగా తయారు చేసిన మూడో ఐలాండ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.  టీఎస్‌టీడీసీ ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. ఇందులో మొత్తం 22 కాటేజీలుండగా, అందులో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు.

ఈ కాటేజ్‌లలో మరో ప్రత్యేకత కూడా ఉంది.ఈత కొలనులు (స్విమ్మింగ్ పూల్ ) నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్స్, ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు. పెద్దల కోసం రెండు స్టాల్స్, రెస్టారెంటు తదితర వసతులు కల్పించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, శిమ్లా, మున్నార్ తదితర ప్రాంతాలను తలపించేలా ఈ మూడో ద్వీపాన్ని సుందరీకరించారు. ఈ అందాలను తీర్చిదిద్దడానికి ఫ్రీ కోట్స్‌కు చెందిన సుమాద్ 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిని త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి