KTR: గ్యారెంటీల కోసం గంజాయి సాగు చేస్తారా..? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..
హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.. గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడం భారంగా మారింది.. దీంతో హిమాచల్ లోని కాంగ్రెస్ సర్కార్ గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గంజాయి సాగు ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.. గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడం భారంగా మారింది.. దీంతో హిమాచల్ లోని కాంగ్రెస్ సర్కార్ గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గంజాయి సాగు ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది.. హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగు చేయాలన్న నిర్ణయంపై శాసనసభలో చర్చ నిర్వహించింది. కమిటీ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిర్ణయించడాన్ని తప్పుబట్టారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో గంజాయి సాగు చేయించేందుకు సిద్ధపడటం సరికాదన్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదని దుయ్యబట్టారు. గ్యారంటీలు అమలు చేయలేక గంజాయి సాగు చేయమంటారా?.. ఇది మీ పార్టీ జాతీయ విధానమా అంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్.. రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
ముందుగా.. గంజాయి సాగు చేయాలని నిర్ణయించిన తర్వాత.. రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా, కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం విశేషం.. అయితే, ఇదే విషయాన్నిBRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఇదేనా మీ పార్టీ జాతీయ విధానమా అంటూ ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్..
కేటీఆర్ ట్వీట్..
Thought this must be a joke when I saw it but guess the joke is on all those who voted for Congress
Is this the national policy of your party @RahulGandhi Ji?
“గ్యారెంటీలు” అమలు చేయలేక “గంజాయి సాగా”? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటదా? pic.twitter.com/X0naCXg18G
— KTR (@KTRBRS) September 10, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..