Kishan Reddy: భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి.. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు, మిగులు రాష్ట్రం.. నేడు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.10 లక్షల కోట్ల భారీ అప్పుల్లోకి కూరుకుపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతోందని.. ఆర్థిక దుర్వినియోగాన్ని కప్పిపుచ్చడానికి, కాంగ్రెస్ ప్రభుత్వ భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా విక్రయించడానికి ప్రయత్నించి. . సుప్రీంకోర్ట్‌లో మొట్టికాయలు తిన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) నెపంతో, సీఎం భూదందాకు తెరలేపారని, ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. GO 27 ద్వారా, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామిక ఎస్టేట్‌లను వాణిజ్య రియల్ ఎస్టేట్ జోన్‌లుగా మార్చడానికి ప్రభుత్వం అనుమతిస్తోందని.. ఇది పరిశ్రమలను హైదరాబాద్ నుంచి బయటకు పంపించేలా చేస్తుందన్నారు.. రేవంత్ రెడ్డి చర్యలు ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువని స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు.
ఈ జిఓను కేవలం పెద్ద రియల్ ఎస్టేట్ లాబీలకు ప్రయోజనం చేకూర్చడానికే తీసుకువచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికైన ప్రతినిధులు, పరిశ్రమ కార్మికులు లేదా పారిశ్రామిక యజమానులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ఇంత సున్నితమైన విధానాన్ని ప్రవేశపెట్టే ముందు, నిపుణుల కమిటీ ద్వారా వివరణాత్మక అధ్యయనం నిర్వహించి ఉండాలి. బదులుగా, ప్రభుత్వం మొదట ఈ విధానాన్ని జారీ చేసి, తరువాత వారంలోపు నివేదికను సమర్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
2014 నుండి కేసీఆర్ ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని.. నేడు, రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులకు ఏమి జరుగుతుందో ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా? పరిశ్రమలు తరలించాల్సి వచ్చినప్పుడు, వారి భవిష్యత్తు ఏమవుతుంది? ఈ కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలి? వారు ఎలా బ్రతుకుతారు? అని ప్రశ్నించారు.
2013లో, హైదరాబాద్ – దాని పరిసర ప్రాంతాల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం HMDA మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని.. కానీ “సంరక్షణ మండలాలు” కిందకు వచ్చిన చాలా మంది రైతులకు ఇది శాపంగా మారిందని.. వారు తమ సొంత భూమిలో ఇళ్ళు నిర్మించుకోకుండా నిరోధించారన్నారు. సంవత్సరాలుగా, రైతులు జోనల్ పరిమితిపై సడలింపు కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ, సరైన సంప్రదింపులు లేకుండా, ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అపరిమిత మార్పిడి అధికారాన్ని అందిస్తోంది, రైతులను మోసం చేస్తోందని వివరించారు.
9వేల ఎకరాల్లో భారీ మల్టీప్లెక్స్‌లు.. వాణిజ్య సముదాయాలు వస్తే, ట్రాఫిక్ రద్దీ విస్ఫోటనం చెందుతుందన్నారు. వేల కార్లు రోడ్డె్క్కితే ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ట్రాఫిక్ గందరగోళం కారణంగా బెంగళూరు ఇప్పటికే పరిశ్రమలను కోల్పోయిందని.. హైదరాబాద్ కూడా అదే మార్గంలో ప్రయాణించాలని ప్రభుత్వం కోరుకుంటుందా? అని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం ట్రాఫిక్, డ్రైనేజీ లేదా మౌలిక సదుపాయాల ప్రభావంపై ఏదైనా అధ్యయనం నిర్వహించిందా? ఈ పారిశ్రామిక మండలాల చుట్టూ పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలంగాణ సమాజం గట్టిగా అనుమానిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవతల గురించి రేవంత్ రెడ్డి చేసిన దురహంకారపూరిత, అవమానకరమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ కూడా హిందూ విశ్వాసం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని.. ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
