Kishan Reddy: బడ్జెట్‌లో ఏం లేదు.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు దొందు దొందే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదని.. బడ్జెట్‌లో కాంగ్రెస్​ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

Kishan Reddy: బడ్జెట్‌లో ఏం లేదు.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు దొందు దొందే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Follow us

|

Updated on: Jul 25, 2024 | 9:36 PM

అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదని.. బడ్జెట్‌లో కాంగ్రెస్​ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్​ పై స్పందించిన కిషన్ రెడ్డి.. ప్రతి సంవత్సరం రైతులకు సీజన్​ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయం (రైతు బంధు/రైతు భరోసా)కు బడ్జెట్​ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్​ మొత్తంలో ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని.. కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదన్నారు. దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి.. రూ.7,638 కోట్లు తగ్గిపోయిందని.. గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 4,365 కోట్ల నుంచి.. రూ. 3,969 కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు.

మొత్తం ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు. కానీ మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే మాకు కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్లో మరోసారి బట్టబయలైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2023-24లో రూ.2వేలుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను.. ఈ బడ్జెట్ లో ఏకంగా రూ.3,003 కోట్లకు పెంచారని.. అంటే ఒక్క ఏడాదిలోనే 30% ఈ కోటా బడ్జెట్ పెంచేశారన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు అని ప్రస్తావించారు. అది ఇప్పటి వరకే ఉన్నది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు అన్నారు దాని ఊసే లేదు. విద్యా నిధి పథకం కింద రూ.5 లక్షల సాయం అన్నారు.. దాని ప్రస్తావన లేదంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.. అదీ లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. గత పదేండ్లలో బడ్జెట్​ లో సరిపోను నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం విధ్వంసమైందని.. దాన్ని బాగు చేయడానికి కనీసం 15 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాల్సి ఉండగా..7 శాతమే నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలేమిటో.. నిధులు ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదు. గత సర్కారు చేసినట్టే.. ప్రభుత్వ భూములన్నీ అమ్మాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరంటూ కిషన్ రెడ్డి పేర్కొననారు. గత సర్కారు విచ్చలవిడిగా చేసిన అప్పులు కట్టేందుకు, కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మరిన్ని అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే ఉన్న రుణభారాన్ని తగ్గించడం లేదని.. పెంచుతున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుతం తెచ్చిన దానికంటే 17 వేల కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు దొందు దొందే అని నిరూపితమైందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!