Vegetable Prices: ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు..
కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ఇక టమోటాల రేట్లకైతే మళ్లీ రెక్కలు వచ్చాయి. కిలో టమోటా రేటు వంద రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు.
కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ఇక టమోటాల రేట్లకైతే మళ్లీ రెక్కలు వచ్చాయి. కిలో టమోటా రేటు వంద రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. దీంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. టమాటతో పాటు.. అన్ని రకాల కూరగాయలు రూ.50 నుంచి 80 వరకు అమ్ముడవుతున్నాయి.. దీంతో ప్రజలు కర్రీ వర్రీ అంటూ తంటలు పడుతున్నారు. కాగా.. టమాట ధరలు పెడరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రైతు బజార్లలో కిలో 48 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని 13 రైతు బజార్లలో కిలో 48 రూపాయలకు టమోటా అమ్మకాలు చేపట్టారు. దీంతో సబ్సిడీ కౌంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు ప్రజలు.
ఇక తెలంగాణలో కూడా వెజ్ ట్రబుల్స్ కనిపిస్తున్నాయి. కూరగాయల రేట్లు.. జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా కిలో వంద అంటూ షాక్ ఇస్తున్నారు వ్యాపారులు. భారీ వర్షాల కారణంగా రవాణాపై ప్రభావం పడడంతో, కూరగాయలు రేట్లు పెరిగాయని చెబుతున్నారు. టమోటా కిలో 100, పచ్చి మిర్చి కిలో వంద,చిక్కుడు కిలో 120, క్యారట్ కిలో వంద, కాకర కిలో 90, కేలిఫ్లవర్ కిలో 80 రూపాయలు పలుకుతున్నాయి. ఇక ఆకుకూరల రేట్లు కూడా మండిపోతున్నాయి. గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారం రోజులకు సరిపోయేవి. ఇప్పుడు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవడం లేదని జనం నిట్టూరుస్తున్నారు.
కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కరీంనగర్‌లో స్థానికంగా కూరగాయల సాగు కూడా తగ్గింది. దీంతో దిగుమతులపై ఆధార పడాల్సి వస్తోంది. ఇక ఉల్లి రేటు కూడా ఘాటెక్కింది. అన్ని రకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. భారీ వర్షాల వల్లే రేట్లు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు.
ఇక హైదరాబాద్‌లో కూడా కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వర్షాలకు పంటలు దెబ్బతినడం.. సమయానికి పంట చేతికి అందకపోవడంతో దిగుబడులు తగ్గి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో టమోటా వంద రూపాయలకు చేరడంతో.. దానికి సామాన్యులు టాటా చెప్పే పరిస్థితి వచ్చింది. రైతు బజార్లలో కూడా టమోటాలను సబ్సిడీ రేట్లకు అమ్మడం లేదని వినియోగదారులు కంప్లయింట్ చేస్తున్నారు. నిత్యం హైదరాబాద్‌కు 6 వేల క్వింటాళ్ల టమాటాలు వస్తుంటాయి.. ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తున్నాయి. దీంతో టమోటాకు డిమాండ్ పెరిగి ధర కొండెక్కింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..