AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కాంగ్రెస్‎లో స్వేచ్ఛ ఉంటుంది.. బీఆర్‎ఎస్‎లో విలువ ఉండదు’.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వాక్యాలు చేశారు. త్వరలో బీఆర్ఎస్‎ఎల్పీ కాంగ్రెస్‎లో విలీనం కాబోతుందన్నారు. ఇక ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‎లో హిమాయత్ నగర్ డివిజన్‎కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని విమర్శించారు.

'కాంగ్రెస్‎లో స్వేచ్ఛ ఉంటుంది.. బీఆర్‎ఎస్‎లో విలువ ఉండదు'.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
Mla Danam Nagender
Srikar T
|

Updated on: Jul 12, 2024 | 1:26 PM

Share

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వాక్యాలు చేశారు. త్వరలో బీఆర్ఎస్‎ఎల్పీ కాంగ్రెస్‎లో విలీనం కాబోతుందన్నారు. ఇక ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‎లో హిమాయత్ నగర్ డివిజన్‎కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని విమర్శించారు. కేసీఆర్‎ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదని ఆరోపించారు. ఒకవేళ దొరికినా.. గంటల తరబడి వైట్ చేయించేవారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‎లో చేరుతున్నారని వివరించారు. బీఆర్ఎస్‎పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‎లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్‎లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‎లో అందరికి విలువ ఉంటుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదని ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. వాటి వివరాలు త్వరలో బయటపెడతామన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..