ప్రకృతికి ప్రాణం పోసిన అటవీశాఖ.. శతాబ్ధాల చరిత్రకు పూర్వవైభవం..
పాలమూరు జిల్లా ఈ పేరు వింటేనే మొదట గుర్తొచ్చేది పిల్లలమర్రి మహా వృక్షం. సుమారు 700ఏళ్ల చరిత్ర గల ఈ భారీ బనియన్ ట్రీ పునరుజ్జీవం పోసుకుంది. అటవీశాఖ సంరక్షణలో సరికొత్తగా చిగురిస్తూ ఆకాశమంత ఆకుపచ్చ అందాలను పరిచేసింది. శతాబ్ధాల తన చరిత్ర ఇప్పట్లో ముగిసేది కాదని ఠీవిగా నిలబడింది మహా వృక్షం పిల్లలమర్రి. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి మహావృక్షం ఉమ్మడి జిల్లాకే తలమానీకంగా నిలిస్తోంది.
పాలమూరు జిల్లా ఈ పేరు వింటేనే మొదట గుర్తొచ్చేది పిల్లలమర్రి మహా వృక్షం. సుమారు 700ఏళ్ల చరిత్ర గల ఈ భారీ బనియన్ ట్రీ పునరుజ్జీవం పోసుకుంది. అటవీశాఖ సంరక్షణలో సరికొత్తగా చిగురిస్తూ ఆకాశమంత ఆకుపచ్చ అందాలను పరిచేసింది. శతాబ్ధాల తన చరిత్ర ఇప్పట్లో ముగిసేది కాదని ఠీవిగా నిలబడింది మహా వృక్షం పిల్లలమర్రి. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలమూరు పిల్లలమర్రి పునర్వైభవానికి సిద్ధమైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి మహావృక్షం ఉమ్మడి జిల్లాకే తలమానీకంగా నిలిస్తోంది. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు దర్శనమిస్తోంది. అయితే పిల్లలమర్రి పునరుజ్జీవంతో ఇక నుంచి వచ్చే పర్యాటకులకు చేరువచేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సందర్శకుల కోసం పిల్లలమర్రి గేట్లు తేరుచుకోనున్నాయి.
నాలుగేళ్ల క్రితం జీవం కోల్పోయిన పిల్లలమర్రి:
నాలుగేళ్ల క్రితం తెగులు, చెదలతో పాలమూరు ప్రతీక పిల్లలమర్రికి గడ్డు పరిస్థితి ఎదురయ్యింది. ఒకానోక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని ఆందోళన చెందారు. సరైన నిర్వాహణ లేక ఎండిపోవడం ఒక వైపు అయితే చెదల పట్టడడం మరోవైపు బాగా దెబ్బతీశాయి. చెదల కారణంగా చెట్టు కొమ్మలు బాగా దెబ్బతిన్నాయి. ఊడలు ఊడిపోవడం, ఆకులు ఎండిపోవడంతో పచ్చని పందిరి వేసినట్లు ఉండాల్సిన పిల్లల మర్రి కళ తప్పింది. దీంతో పరిస్థితిని గమనించిన నాటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పిల్లలమర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీశాఖ పర్యవేక్షణలో అధునాతన పద్ధతిలో చెట్టును కాపాడే ప్రయత్నం చేశారు. భారీ మర్రిచెట్టు ఊడలకు చెదలు పట్టడంతో అధికారులు సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావాణాన్ని నింపి చికిత్స అందించారు. ఊడల మొదళ్ల పాదుల దగ్గర మట్టిలో జీవం పోయి చెదలు పట్టడంతో.. బలమైన సేంద్రీయలతో కూడిన మట్టిని నింపారు. మర్రిచెట్టు బలంగా ఉండాలంటే దాని ఊడలు భూమిని తాకాలి.. అలా అయితేనే బలంగా నిలబడుతుంది. దీంతో ఊడలకు ఎలాంటి సమస్యలు రాకుండా పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వాటి ద్వారానే క్లోరోపైరిపాస్ లిక్విడ్‌ను అందించారు. సుదీర్ఘ కాలం తర్వాత తాతల, ముత్తాతల నాటి చెట్టు మళ్లీ జీవం పోసుకుంది.
పిల్లల మర్రి నీడలోకి త్వరలోనే పర్యాటకులు:
ఫారెస్ట్ అధికారుల చోరవతో పిల్లలమర్రికి మళ్లీ జీవం వచ్చింది. ఊడలు బాగా పెరిగి నేలలోకి చొచ్చుకెళ్లాయి. చెదలు పట్టిన కొమ్మలు మళ్లీ ధృడంగా తయారయ్యాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ భారీ వృక్షం మళ్లీ దర్జాగా నిలబడింది. దీంతో నిండా కొత్త కొమ్మలు, ఆకులుతో కళకళలాడుతోంది. ఆకుపచ్చని పందిరి వేసి సంపూర్ణ ఆరోగ్యంగా తన మనుగడ ఇంకా ఉందంటూ పునర్వైభావానికి సన్నధమైంది పిల్లలమర్రి. చెట్టును సంరక్షించే ప్రక్రియ సుధీర్ఘంగా కొనసాగడంతో దాదాపుగా నాలుగేళ్ల నుంచి సందర్శకులను సమీప ప్రాంతాలకు అనుమతించ లేదు. కేవలం బయట దూరం నుంచి మాత్రమే చెట్టును చూసి వెళ్లే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వాచ్ స్టాండ్‌ను ఏర్పాటు చేసి చెట్టును తాకకుండా సందర్శనకు అవకాశం కల్పించారు. అయితే మహా వృక్షాన్ని దగ్గరి నుంచి చూసే అవకాశం లేకపోవడంతో ఇన్ని రోజులు పర్యాటకులు అసంతృప్తిగా వెనుదిరుగుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తాజా ప్రకటనతో సంతోషంలో మునిగిపోతున్నారు. పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లలమర్రి గేట్లు తెరుచుకోనున్నాయి. మహావృక్షాన్ని తాకకుండా కేవలం చూస్తూ ఆ నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకుల కోసం మౌలికవసతులను అభివృద్ధి చేశారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంటు, పర్యాటకులు సేదతీరేలా ఆకర్షణీయమైన బెంచీలు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా పిల్లల కోసం సరికొత్తగా పార్కును, వాల్ పెయింటింగ్స్ సిద్ధం చేశారు. అటవీశాఖ అధికారుల సంరక్షణ చర్యలు సత్పలితాలివ్వడంతో పాలమూరు ఐకానిక్ పిల్లలమర్రి మళ్లీ జీవం పోసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..