AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చోరీల్లో వీరి స్టైలే వేరు.. అన్నం పెట్టిన కంపెనీకి కన్నం వేసిన మాజీ ఉద్యోగులు..

ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. తమకున్న అనుభవంతో గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేశారు. అయితే ఈ ముఠాలోని సభ్యుడు చేసిన చిన్న దొంగతనంతో గుట్టురట్టయి చివరికి కటకటాల పాలయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ధీరావత్ నగేశ్, ధీరావత్ చిరంజీవి , ధరావత్ మురళి, పానుగోతు సుమన్, ధీరావత్ నవీన్‎లు గతంలో కొత్త సెల్ టవర్ల నిర్మాణం, మెయింటనెన్స్ కంపెనీల్లో పని చేసి మానేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరంతా ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం పథకం వేశారు.

చోరీల్లో వీరి స్టైలే వేరు.. అన్నం పెట్టిన కంపెనీకి కన్నం వేసిన మాజీ ఉద్యోగులు..
Nalgonda
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 12, 2024 | 12:26 PM

Share

ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. తమకున్న అనుభవంతో గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేశారు. అయితే ఈ ముఠాలోని సభ్యుడు చేసిన చిన్న దొంగతనంతో గుట్టురట్టయి చివరికి కటకటాల పాలయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ధీరావత్ నగేశ్, ధీరావత్ చిరంజీవి , ధరావత్ మురళి, పానుగోతు సుమన్, ధీరావత్ నవీన్‎లు గతంలో కొత్త సెల్ టవర్ల నిర్మాణం, మెయింటనెన్స్ కంపెనీల్లో పని చేసి మానేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరంతా ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం పథకం వేశారు. తమకున్న అనుభవంతో గతంలో పనిచేసిన కంపెనీకే కన్నం వేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్ టెల్ సెల్ ఫోన్ టవర్లను టార్గెట్ చేసుకొని, అందులోని 5జీ రేడియో రిమోట్ యూనిట్లను అపహరించారు.

టవర్ నుంచి ఆర్ఆర్డీయూలను తొలగించడం ద్వారా వినియోగ దారులకు ఎలాంటి సిగ్నల్స్ ప్రాబ్లమ్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్ సైతం ఉండదని కేవలం 5జీ సిగ్నల్ బదులు 4జీ సిగ్నల్ వస్తుందని తెలిసి ఆర్ఆర్డీయూలను టార్గెట్ చేశారు. ఆర్ఆర్డీయూలను చోరీ జరిగిన విషయం టవర్లను పరిశీలిస్తే తప్ప తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. దానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఎవరికీ చిక్కకుండా సులభంగా తప్పించుకోవచ్చ ఆలోచనతో రాత్రి పూట నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న టవర్లలో దొంగతనాలు చేసేవారు. చోరీ చేసిన ఆర్ఆర్డీయూలను హైదరాబాద్‎లోని నాంపల్లికి చెందిన మున్నా అనే వ్యక్తికి అతి తక్కువ ధరలకు విక్రయించాడు. తద్వారా వచ్చిన నగదును ఐదుగురు సమానంగా పంచుకుంటున్నారు. సిగ్నలింగ్ ప్రాబ్లంతో ఎయిర్టెల్ సంస్థ టవర్లను పరిశీలించగా ఆర్ఆర్డీయూలు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంస్థ ప్రతినిథులు.

ఆర్ఆర్డీయూల చోరీని గుర్తించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఈ ముఠాలోని కొందరు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా సెల్ టవర్ల ఆర్ఆర్డీయూల చోరీ గుట్టు రట్టయింది. ఈ ముఠా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట,మాడ్గులపల్లి, భువనగిరి, వాడపల్లి, మిర్యాలగూడ, చింతపల్లి, తిరుమల గిరి(సాగర్), మహబూబ్‎నగర్ జిల్లాలోని బాలానగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఆర్ఆర్డీయూలను చోరీ చేశారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 25 చోట్ల చోరీలకు పాల్పడిన ఈ ముఠా నుండి రూ.1,20,000 నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ముఠాలో నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..