Raj Tarun Lavanya Case: బయటికి వచ్చిన FIR కాపీ.. A1 ముద్దాయి రాజ్ తరుణే..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య, మాల్వీ పోటా పోటీగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ.. పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య తన సోదరుడికి మెసేజులు పంపుతోందంటూ ఆమెపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య, మాల్వీ పోటా పోటీగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ.. పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య తన సోదరుడికి మెసేజులు పంపుతోందంటూ ఆమెపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే వీరి ఫిర్యాదు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని టీవీ9 సంపాదించింది.
టీవీ9 సంపాదించిన ఎఫ్‌ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A1గా రాజ్‌తరుణ్ ఉంటే.. A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్‌తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి.. ఇటీవలి వరకూ ఏం జరిగిందో పేర్కొంది. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉందనేది లావణ్య వాదన. 2010లో రాజ్‌తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు.. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్తోంది. అలాగే రాజ్‌తరుణ్‌కు తాను గతంలో 70 లక్షలు ఇచ్చానంటోంది.
2016లో రాజ్‌తరుణ్ వల్ల తాను గర్భవతిని అయ్యానని, అయితే రెండో నెలలోనే అబార్షన్ చేయించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను అనవసరంగా డ్రగ్స్ కేసులో రాజ్‌తరుణ్, మాల్వీ ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. మరోవైపు హీరోయిన్ మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారంటోంది లావణ్య.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.