TOP9 ET: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్ ఓయమ్మో.. | న్యాయం కోసం పవన్‌ను కలుస్తానంటున్న లావణ్య.

TOP9 ET: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్ ఓయమ్మో.. | న్యాయం కోసం పవన్‌ను కలుస్తానంటున్న లావణ్య.

Anil kumar poka

|

Updated on: Jul 12, 2024 | 9:54 AM

న్యాయం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలుస్తానని లావణ్య చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మాటలతో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక రాజ్‌ తరుణ్ తనను మోసం చేశాడని.. ఇటీవల పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన ఈమె.. రాజ్‌ తరుణ్‌తో పాటు..తనతో వర్క్‌ చేసిన మాల్వీ మల్హోత్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది. మాల్వీ తో ఎఫైర్ కారణంగానే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

01.ram charan car: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. ఓయమ్మో.. మామూలుగా లేదుగా.!

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. దేశంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇక తన నయా బ్లాక్ బీస్ట్ తో .. ఎలాంగ్ విత్ తన లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు చరణ్‌.

02.ambani: అనంత్ అంబానీ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు.

ఇండియా మొత్తం.. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటుంటే..! టాలీవుడ్‌ అండ్ తెలుగు టూ స్టేట్స్‌ మాత్రం.. ఈ ఈవెంట్‌కు ఒక్క రామ్‌ చరణ్ వెళ్లడం గురించే మాట్లాడుకుంటోంది. ఎస్ ! బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ ల పెళ్లి.. జులై 12న ముంబాయ్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఉపాసన, క్లీంకారతో కలిసి వెళ్లారు. అయితే ఇప్పటికే వరకు చరణ్ మాత్రమే అంబానీ పెళ్లికి వెళుతున్నట్టు టాక్.

03.lavanya: న్యాయం కోసం పవన్‌ను కలుస్తానంటున్న లావణ్య.!

న్యాయం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలుస్తానని లావణ్య చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మాటలతో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక రాజ్‌ తరుణ్ తనను మోసం చేశాడని.. ఇటీవల పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన ఈమె.. రాజ్‌ తరుణ్‌తో పాటు..తనతో వర్క్‌ చేసిన మాల్వీ మల్హోత్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది. మాల్వీ తో ఎఫైర్ కారణంగానే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని.. సాక్ష్యాధారాలను పోలీస్ స్టేషన్లో సబ్‌మిట్ చేసింది. దీంతో ఈ హీరోపై.. తన ప్రేయసిగా చెబుతున్న మాల్వీపై నార్సింగ్ పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ ఐ ఆర్ నమోదైంది.

04. indian 2: కమల్‌కు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్..

ఉలగ నాయకన్ కమల్‌ హాసన్‌కు రేవంత్‌ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇండియన్ 2 సినిమాకు తెలంగాణలో కూడా టికెట్‌ రేట్స్‌ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇక ఎన్నో అంచనాల మధ్య జూలై 12న రిలీజ్ అవుతున్న ఈసినిమా టికెట్‌ రేట్లు జులై 12 నుంచి 19 తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు.. మల్టీఫ్లెక్స్‌లో 75 రూపాయల మేర పెరగనుంది. అలానే వారం రోజులపాటు ఐదో ఆట ప్రదర్శనకి కూడా రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమా స్టార్టయ్యే ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై యాడ్స్ ను ప్రదర్శించాలని కండీషన్ పెట్టింది.

05. indian2: కొండెక్కిన ఇండియన్-2 టిక్కెట్ రేట్స్..

ఇక ఇండియన్2 టికెట్ రేట్స్ ను పెంచడంపై .. నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టికెట్ రేట్ పెరగడంతో.. విత్ జీఎస్టీ కలిపి.. కొన్ని మల్టీప్లెక్స్‌లలో ఈ మూవీ టికెట్ రేట్ 400 నుంచి 500కు చేరుకుంది. అయితే ఈ సినిమా నేటివ్ స్టేట్ తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో.. ఇండియన్ 2 రేట్స్‌ మన దగ్గర కంటే తక్కువగా ఉండడంతో.. ఇప్పుడు ఇదో ఇష్యూ గా మారింది.

06.devara: దేవర నుంచి సూపర్ డైలాగ్ లీక్.!

‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’! ఇది దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్. అయితే ఈ డైలాగ్‌ ఇప్పుడు నెట్టింట లీకైపోయింది. ఎవరు చేశారో.. ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ.. ఇప్పుడు ఇదే డైలాగ్‌ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పిస్తోంది.

07.raviteja: రవితేజ స్టెప్ పై నెటిజన్ విమర్శలు.. హరీశ్ శంకర్ ఫన్నీ సెటైర్‌.

రవితేజాస్‌ మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఓ రొమాంటిక్ మెలోడి సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్‌లో రవితేజ హీరోయిన్ కలిసి చేసిన ఓ హుక్ స్టెప్‌ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ’56 ఏళ్ల రవితేజ, 25 ఏళ్ల భాగ్యశ్రీతో అభ్యంతరకరమైన స్టెప్స్‌ వేస్తున్నారని.. హీరోయిన్‌ను ఓ వస్తువులా చూపించడమే వీరిక్కావాలి అంటూ.. ఈ స్టెప్‌పై ఓ నెటిజన్‌ నెట్టింట విరుచుకుపడ్డాడు. అయితే ఆ నెటిజన్‌కు స్ట్రాంగ్ సెటైర్ విసిరారు హరీష్. కంగ్రాట్స్ బావా కనిపెట్టావ్. నోబెల్ ఫ్రైజ్‌ కు అప్లై చేసుకో. ఇదే తరహాలో మా ఫిల్మ్ మేకర్లను వస్తువులా చూడడాన్ని కొనసాగించు.. అంటూ ఆ నెటిజన్‌కు వ్యంగ్యంగా రిప్లయ్ ఇచ్చాడు.

08.darshan: ఇంటి భోజనం అడిగిన దర్శన్ కోర్టు ఏం చెప్పిందో తెలుసా?

రేణుకా స్వామి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు .. కోర్ట్‌ ఝలక్ ఇచ్చింది. డయేరియాతో బాధపడుతున్న తాను.. జైల్ ఫుడ్ తినలేక పోతున్నానని.. అందుకే ఇంటి నుంచి ఆహారం తీసుకోడానికి పర్మిషన్ ఇవ్వాలని.. కోర్టును వేడుకున్నాడు. అయితే కోర్టు దర్శన్ విన్నపాన్ని పక్కన పెట్టేసింది. జైల్లో అందరూ సమానమే అని.. విచారణ ఖైదీలకు ఉన్న నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొంది.

09.manchu: యూట్యూబర్లకు మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్.

తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. నటీనటులపై చేసిన ట్రోలింగ్, అసభ్యకర వీడియోలను 48 గంటల్లోగా డిలీట్ చేయాలంటూ క్రియేటర్లకు డెడ్ లైన్ పెట్టారు. ఒక వేళ డిలీట్ చేయకపోతే దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, యూట్యూబ్‌ ఛానల్స్‌ బ్యాన్ చేసేలా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు మంచు విష్ణు. అంతే కాదు ఈ విషయంలో తమను సోపోర్ట్‌ చేయాలంటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు విష్ణు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.