Darshan: హద్దులు దాటుతున్న హీరో దర్శన్ అభిమానులు.. బుద్ది చెబుతున్న పోలీసులు.!

Darshan: హద్దులు దాటుతున్న హీరో దర్శన్ అభిమానులు.. బుద్ది చెబుతున్న పోలీసులు.!

Anil kumar poka

|

Updated on: Jul 12, 2024 | 11:53 AM

హత్యానేరంపై నటుడు దర్శన్‌ అరెస్ట్‌ తర్వాత ఆయన అభిమానులు కొందరు అతిగా స్పందిస్తున్నారు. విమర్శల పాలవుతున్నారు. జైల్లో దర్శన్ కు ఇచ్చిన ఖైదీ నంబర్ ను అభిమానులు టాటూలుగా వేసుకుంటూ గర్వంగా చూపించుకుంటున్నారు. మరో అభిమాని చిన్నారి డ్రెస్ పై ఖైదీ నెంబర్ వేసి ఫోటో షూట్ చేశాడు. అలాగే 6106 నెంబర్ ను తమ వాహనాలకు నంబర్ ప్లేట్లుగా తగిలించుకుంటున్నారు. ఇప్పుడు మైసూర్‌కి చెందిన ఒక అభిమాని మరీ రెచ్చిపోయాడు.

హత్యానేరంపై నటుడు దర్శన్‌ అరెస్ట్‌ తర్వాత ఆయన అభిమానులు కొందరు అతిగా స్పందిస్తున్నారు. విమర్శల పాలవుతున్నారు. జైల్లో దర్శన్ కు ఇచ్చిన ఖైదీ నంబర్ ను అభిమానులు టాటూలుగా వేసుకుంటూ గర్వంగా చూపించుకుంటున్నారు. మరో అభిమాని చిన్నారి డ్రెస్ పై ఖైదీ నెంబర్ వేసి ఫోటో షూట్ చేశాడు. అలాగే 6106 నెంబర్ ను తమ వాహనాలకు నంబర్ ప్లేట్లుగా తగిలించుకుంటున్నారు. ఇప్పుడు మైసూర్‌కి చెందిన ఒక అభిమాని మరీ రెచ్చిపోయాడు. దర్శన్ రిలీజయ్యేంతవరకు చెప్పులు వేసుకోనని ఏకంగా శపథం చేశాడు. అలాగే తమ హీరో విడుదలైతే దేవునికి కానుకలు సమర్పిస్తామని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరోవైపు దర్శన్ కు కేటాయించిన నెంబర్ ను స్టిక్కర్లుగా అతికించుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. జగదీష్ అలియాస్ జగ్గా అనే ఆటో డ్రైవర్ ప్రమాదకరంగా ఆటోను నడిపాడు. ట్రాఫిక్ ఉన్న రోడ్లపై ఆటో వీలింగ్ చేశాడు. అతని క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ వీలింగ్ చేస్తున్న దృశ్యం వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వాహనం నంబర్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. హెచ్చరించి బెయిల్‌పై విడుదల చేశారు. అలాగే ఆటో వెనుక వేసిన ‘డి బాస్ 6106’ అనే స్టిక్కర్‌ను పోలీసులు తొలగించారు.

ఇక కొద్దిరోజుల క్రితం ‘ఖైదీ నంబర్ 6106’ విషయంలో మరో దారుణమైన సంఘటన నమోదైంది. చిన్న పిల్లాడికి ఈ నెంబర్ వేసి ఫోటో షూట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. చిత్రదుర్గలోని రేణుకా స్వామి హత్య చేసిన కేసులో దర్శన్ జైలులో ఉన్నాడు. ఆయనతో పాటు పవిత్ర గౌడ తదితరులు కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జైల్లో ఉన్న దర్శన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.