Service medals : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ పోలీస్ సిబ్బందికి సర్వోన్నత సేవా పతకాలు ప్రకటించిన కేసీఆర్ సర్కారు
తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలందించిన పోలీసులకు..
KCR government announced Highest service medals for police personnel : తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలందించిన పోలీసులకు ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సర్కారు 6 పతకాల గ్రహీతల వివరాల్ని ప్రకటించింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ, హైదరాబాద్ కానిస్టేబుల్ రామిరెడ్డికి విధి నిర్వహణలో చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముగ్గురికి శౌర్య, ఎనిమిది మందికి మహోన్నత, 102 మందికి ఉత్తమ, 45 మందికి కఠిన, 503 మందికి సేవా పతకాలను కేసీఆర్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు వారి జాబితాతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ ఫోన్లో మాట్లాడి గజ్వేల్ ఏసీపీ నారాయణను అభినందించారు. ఇదే నిబద్ధతతో పని చేస్తూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిచారు. అలాగే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఏసీపీకి శుభాకాంక్షలు తెలిపారు.