MLC Kavita: జాతీయ నేతలపై పోటీకి సై అంటున్న కవిత.. తెలంగాణలో మరోసారి ఆసక్తికర రాజకీయాలు..
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మంచి జోష్తో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టగానే ఎంపీ సీట్లపై ఫోకస్ పెట్టింది. అంతే దీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందరికంటే ముందుగా అభ్యర్థులపై కసరత్తులు మొదలు పెట్టింది. ఇదంతా ఇలా ఉంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మంచి జోష్తో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టగానే ఎంపీ సీట్లపై ఫోకస్ పెట్టింది. అంతే దీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందరికంటే ముందుగా అభ్యర్థులపై కసరత్తులు మొదలు పెట్టింది. ఇదంతా ఇలా ఉంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి హనుమంతరావు ఇప్పటికే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకోరారు. తెలంగాణ నుంచి పోటీ చేస్తే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ ప్రభావం చూపించగలుగుతుందని భావిస్తున్నారు.
1980లో తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరా గాంధీ ఒకసారి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 15 పార్లమెంట్ సీట్లకు 15 కాంగ్రెస్ గెలుచుకుంది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సోనియా లేదా ప్రియాంకలను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు ఇక్కడి నేతలు. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి నుంచి ఇక్కడ ఈ జాతీయ నేతలు ఎవరు పోటీ చేసినా ప్రత్యర్థిగా కవితను రంగంలోకి దింపాలని పార్టీ భావిస్తుంది. సోనియా లేదా ప్రియాంక పోటీ చేస్తే ఏం చేయాలనే దానిపై దీటైన ప్రతిపక్షంగా ఇప్పటి నుంచి దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. ప్రియాంక, సోనియా లాంటి దిగ్గజ నేతలకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిగా కేసీఆర్ కుమార్తె కవితను భావిస్తున్నారు.
గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో మొదటిసారిగా అడుగు పెట్టారు కవిత. తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంట్లో గట్టిగా తన గళాన్ని వినిపించారు. మహిళా బిల్లు కోసం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. కల్వకుంట్ల కవితను ఈ ఇద్దరు నేతల్లో ఎవరు పోటీ చేసిన.. ఖచ్చితంగా రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..