E challan: పెండింగ్‌ చలాన్‌ డిస్కౌంట్‌కి ముగుస్తోన్న గడువు.. ఇప్పటి వరకు ఏకంగా..

ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని వాహనదారులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 11 రోజుల్లో ప్రభుత్వానికి ఏకంగా రూ. 66.77 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 76.79 లక్షల చలాన్లకు 66.77 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇక ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే...

E challan: పెండింగ్‌ చలాన్‌ డిస్కౌంట్‌కి ముగుస్తోన్న గడువు.. ఇప్పటి వరకు ఏకంగా..
E Challan
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2024 | 8:39 AM

వాహనాలకు సంబంధించి ఉన్న పెండింగ్ చలాన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలాన్లు చెల్లిస్తే వాహనాల ఆధారంగా 50 నుంచి 90 శాతం వరకు పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 26వ తేదీ నుంచి ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని వాహనదారులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 11 రోజుల్లో ప్రభుత్వానికి ఏకంగా రూ. 66.77 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 76.79 లక్షల చలాన్లకు 66.77 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇక ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రూ. 17 కోట్లు చెల్లింపులు జరగగా, సైబరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలో రూ. 13.99 కోట్లు వసూళ్లు జరిగాయి. అలాగే రాచకొండ కమిషనర్ పరిధిలో రూ. 7.17 కోట్లు చలాన్లు రూపంలో వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇచ్చిన గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది.

జనవరి 10వ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ ముగియనుంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్‌ 25వ తేదీ వరకు పడిన చలాన్లకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ అమలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్‌ 25 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్ చలాన్లపై 90 శాతం డిస్కౌంట్ ప్రకటించగా.. ద్విచక్రవాహనాల చలాన్లకు 80 శాతం రాయితీ కల్పించారు. ఇక.. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

ఫేక్‌ వెబ్‌సైట్స్‌తో జాగ్రత్త..

ఇదిలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు.. పెండింగ్‌ చలాన్లను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ చలాన్‌ పేరుతో ఫేక్‌ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి డబ్బును కాజేస్తున్నారు. కాబట్టి వెబ్‌సైట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ సేవ సెంటర్లు, పేటీఎమ్‌ ద్వారా చలాన్లను చెల్లించాలని సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి పెండింగ్‌ చలాన్లను పే పేసుకోవచ్చని చెబుతన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..