AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: కాసులు కురిపించిన కార్తీక మాసం.. యాదాద్రీశుడికి రికార్డు స్థాయిలో ఆదాయం!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి కార్తీకమాసంలో రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి మూడు కోట్లకు పైగా అధిక ఆదాయం దేవస్థానానికి సమకూరింది. ఇంతకు ఈ సారి వచ్చిన ఆధాయం ఎంతో తెలుసుకుందాం పదండి

Yadadri Temple: కాసులు కురిపించిన కార్తీక మాసం.. యాదాద్రీశుడికి రికార్డు స్థాయిలో ఆదాయం!
Yadadri Temple
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 9:47 PM

Share

తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతున్న పాంచనారసింహుడికి ఆదాయం నానాటికి పెరుగుతోంది. ఆధ్యాత్మికంగా కార్తీక మాసం ప్రాముఖ్యత సంతరించుకోవడంతో స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసంలో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తిక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ఆదాయం కూడా భారీగానే సమకూరింది. దీంతో ఆలయానికి భక్తులు భారీ స్థాయిలో రావడంతో రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది.

కార్తీక మాసంలో స్వామి వారిని 20,52,054 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో కార్తీకమాసం నెల రోజుల్లో 17, 62, 33, 331 రూపాయల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత ఏడాది కార్తీక మాసం నెల రోజుల్లో 14,30,69,481 రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే.. ఈసారి కార్తీకమాసంలో 3,31,63,850 రూపాయల అధిక ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రెండున్నర కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us