ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేశాడు. అలాగే ఒక వ్యక్తి నిజాయితీగా ఉండాలా లేదా అనే విషయాలను కూడా తెలియజేయడం జరిగింది.
నిజాయితీ
ఆయన మాట్లాడుతూ, అతి నిజాయితీ అస్సలే ఉండకూడదు, ఎవ్వరైనా సరే, నిటారుగా పెరిగే చెట్లను మాత్రమే ముందుగా నరుకుతారు.
నిటారుగా ఉండే చెట్లను నరకడం
అలాగే కాస్త వంగి , వంకరగా ఉన్న చెట్ల జోలికి ఎవ్వరూ వెళ్లరు. అదే విధంగా నిజాయితీపరులనే ముందుగా మోసం చేస్తారని చాణక్యుడు చెప్పుకొచ్చాడు.
వంకరగా ఉండే చెట్లు
అలా అనీ అందరినీ అవినీతిపరులుగా ఉండమని చెప్పడం కాదు, అమాయకంగా ఉండటం మానుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నారు.
అవినీతి పరులు
నిజాయితీగా ఉండటానికి మోసపోవడానికి చాలా తేడా ఉంది. గుడ్డిగా నిజాయితీగా ఉండటం మంచి లక్షణం కాదు అని తెలిపాడు.
నిజాయితీగా ఉండటం
మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే అబద్ధాల కోరుగా మారాల్సిన అవసరం లేదు, కేవలం వ్యూహాత్మకంగా ఉంటే సరిపోతుందని ఆయన తెలియజేశారు.
వ్యూహాత్మకంగా ఉండటం
అదే విధంగా ప్రజలను తేలికగా నమ్మవద్దు, వారి నమ్మకాన్ని సంపాదించుకోండి, క్రమంగా వారితో మనసు విప్పి మాట్లాడండి, అంతే తప్ప మిమ్మల్ని బలహీనంగా మార్చుకోవద్దు.