Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart city Controversy: మేయర్ వర్సెస్ మాజీ మేయర్.. సొంత పార్టీలోనే కుంపటి రాజేసిన స్మార్ట్ సిటీ వ్యవహారం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా వార్ మొదలైంది. అధికార పార్టీ సీనియర్ నేతల మధ్యే ఈ వివాదం రాజుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కూడా కరీంనగర్ బీఆర్ఎస్ నేతల పంచాయితీ యథావిధిగానే కొనసాగుతున్నట్టుగా ఉంది. తాజాగా అవినీతి, అక్రమాలపై మాజీ మేయర్ మునిసిపల్ ఇంజనీర్లపై ఆరోపణల పర్వానికి దిగారు.

Smart city Controversy: మేయర్ వర్సెస్ మాజీ మేయర్.. సొంత పార్టీలోనే కుంపటి రాజేసిన స్మార్ట్ సిటీ వ్యవహారం
Karimnagar Ravinder Singh Sunil Rao
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 21, 2023 | 3:48 PM

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా వార్ మొదలైంది. అధికార పార్టీ సీనియర్ నేతల మధ్యే ఈ వివాదం రాజుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా అవినీతి, అక్రమాలపై మాజీ మేయర్ మునిసిపల్ ఇంజనీర్లపై ఆరోపణల పర్వానికి దిగారు. మాజీ మేయర్ ఆరోపణలతో తాజా మేయర్ సునీల్ రావు ఎదురు దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వార్ తారస్థాయికి చేరగా మరో వైపున మాజీ మేయర్ మునిసిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.

నిరూపిస్తావా..? క్షమాపణలు కోరతావా..? మేయర్ సునీల్ రావు

కరీంనగర్ కార్పోరేషన్ అవినీతిపై మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ చేసిన ఆరోపణలపై మేయర్ సునీల్ రావు స్పందించారు. అవినీతి అక్రమాలపై ఆయన చేసిన ఆరోపణలన్ని అబద్దమని కొట్టిపారేశారు. కరీంనగర్ లో మెజార్టీ తగ్గడానికి స్మార్ట్ సిటీతో ఏ మాత్రం సంబంధం లేదన్నారు. మాజీ మేయర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని లేనట్టయితే క్షమాపణలు కోరాలని సునీల్ రావు డిమాండ్ చేశారు. ఆయన వైఖరిపై అధిష్టానానిక కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

గురువారం కరీంనగర్ ఆయన మీడియాతో మాట్లాడూతు… స్మార్ట్ సిటీకి సంబంధించిన వర్క్స్ ఇప్పటి వరకు రూ. 934.11 విలువైన పనుల కోసం టెండర్లకు పిలిచామని, ఇందులో రూ. 514 కోట్ల పేమెంట్ చేశామన్నారు. ఇంకా రూ. 196 కోట్ల బిల్లులు మంజురూ చేయాల్సి ఉందన్నారు. రవిందర్ సింగ్ హయాంలో టెండర్లకు పిలిచినా ఏడాదిగా టెండర్లు ఓపెన్ చేయలేదని దుయ్యబట్టారు. రికార్డులను పరిశీలించి క్వాలిటీ కంట్రోలో ఆమోదంతో మాత్రమే బిల్లులు ఇస్తారని, అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఇవ్వలేదన్నారు. కరీంనగర్ కార్పోరేషన్ లో అవకతవకలు జరగలేదని నిరూపించాలని లేనట్టయితే తప్పు అయిందని క్షమాపణలు కోరాలని సునీల్ రావు డిమాండ్ చేశారు. టవర్ సర్కిల్ లోని ఇండ్లు కూలగొట్టాలన్న ప్రతిపాదనలు చేసింది రవిందర్ సింగ్ అని ఆరోపించారు. 2009, 20014 ఎన్నికల్లో మెజార్టీ వచ్చిందని అప్పుడు స్మార్ట్ సిటీ వర్క్స్ లేవని స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్క కరీంనగర్ లోనే గెలిచారన్నారు. వెన్నుపోటు దారులు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్నారు. రవిందర్ సింగ్ హయాంలో కూడా పనులన్నింటికి కలిపి ఒకే టెండర్ పిలిచిన చరిత్ర కూడా ఉందని, ఇప్పుడు మేము అలా చేస్తే తప్పు ఎలా అవుతుందని సునీల్ రావు ప్రశ్నించారు. అనవర ఆరోపణలు చేసిన రవిందర్ సింగ్ నిరూపించాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యవహారంపై అధిష్టానం దృష్టికి తీసుకెల్తామని స్పష్టం చేశారు. రూ. 130 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై స్ఫష్టత ఇవ్వాల్సిందేనని సునీల్ రావు కోరారు.

ఫిర్యాదు చేసిన మాజీ మేయర్…

తాజాగా మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన రూ. 133 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు బిట్లుగా చేయకుండా సింగిల్ టెండర్ కు పిలిచారని ఈ విషయంలో విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రవిందర్ సింగ్ మునిసిపల్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని పార్టీకి నష్టం కల్గించే విధంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే తాను పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్టుగా వారు చూపించాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తుంటే మేయర్ కు ఎందుకు ఇబ్బంది కలుగుతున్నదని ప్రశ్నించారు. ఇంజనీర్ల తప్పిదాలను ఎత్తి చూపుతుంటే సునీల్ రావు వ్యక్తిగత ఫిర్యాదులు చేయడం ఏంటన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చేతులు పెట్టి గీరినా మెటిరియల్ ఊడి వస్తున్నదంటే అవినీతి ఎంత మేర జరిగిందో అర్థం చేసుకోవాలన్నారు.

ఏది ఏమైనా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్మార్ట్ సిటీ నిధుల వ్యవహారం కాస్తా అధికార పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరకూ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..