Kadiyam Srihari: హామీలు నెరవేర్చడం లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కడియం శ్రీహరి విమర్శలు (Watch Video)
ఆరు గ్యారెంటీల పేరిట మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ మాట తప్పుతోందని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల పేరిట మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ మాట తప్పుతోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల భృతి ఇస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ చెప్పారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా దీన్ని పొందుపర్చారని అన్నారు. అయితే ఇప్పుడు నిరుద్యోగ భృతి హామీ తాము ఎక్కడా ఇవ్వలేదని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పడం సరికాదని విమర్శించారు.
అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను డిసెంబరు 9న మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు అమలు చేయడం లేదని కడియం శ్రీహరి అన్నారు. వరికి మద్దతు ధరకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టంచేశారు.
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

