ప్రాణం పోశారు.. మిరాకిల్ చేశారు.. దేవుళ్ళుగా మారారు.. 108 అంబులెన్స్ సిబ్బంది..

ప్రాణాలతో పోరాడేవారిని సమయానికి ఆస్పత్రికి చేర్చి ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తుంటారు. కానీ ఈ సారి అలా కాకుండా వారే ప్రాణం పోశారు... ప్రాణం నిలిపారు. అంబులెన్స్‌ సిబ్బంది...

ప్రాణం పోశారు.. మిరాకిల్ చేశారు.. దేవుళ్ళుగా మారారు.. 108 అంబులెన్స్ సిబ్బంది..
Karimnagar Ambulance Staff

ప్రాణం నిలిపే దేవుళ్లు.. ఈ సారి ప్రాణం పోశారు. ప్రాణాలతో పోరాడేవారిని సమయానికి ఆస్పత్రికి చేర్చి ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తుంటారు. కానీ ఈ సారి అలా కాకుండా వారే ప్రాణం పోశారు… ప్రాణం నిలిపారు. అంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు తిరిగి ఊపిరిపోశారు. గుండె ఆగిపోయి సీరియస్ కండిషన్‎లో ఉన్న మూడు రోజుల పసికందుకు మళ్లీ ప్రాణం పోశారు 108 అంబులెన్స్ సిబ్బంది. సీపీఆర్ ప్రక్రియ ద్వారా హృదయ స్పందన కలిగేట్టు చేసి చిన్నారిని బతికించారు.

ఈ అరుదైన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా మంగళవారం రోజు కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి పరిస్థితి కొంత క్రిటికల్‌‌గా ఉండటంతో చికిత్సను అందించారు. ఈ క్రమంలో ఒ‍క్కసారిగా, బాబు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే ఆ బాలుడిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు.

అంబులెన్స్‎లో పసికందును వరంగల్ తీసుకెళ్తున్న సమయంలో  గుండె ఆగిపోయింది. దీంతో 108 సిబ్బంది సమయ స్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాపాయం నుంచి చిన్నారిని తప్పించారు. CPR  హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. హార్ట్ బీట్ నార్మల్ స్థితిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ పసికందును ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ఇది కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..

 

Click on your DTH Provider to Add TV9 Telugu