Telangana: దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ఛేజింగ్.. రెండున్నర గంటల పాటు ఉత్కంఠ.. చివరకు
సినిమాల్లో ఛేజింగ్ సీన్లు చూశారా...? సేమ్ ఇక్కడ అదే సిట్యువేషన్ జరిగింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు, ఏకంగా పోలీసుల పైనే రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి..
సినిమాల్లో ఛేజింగ్ సీన్లు చూశారా…? సేమ్ ఇక్కడ అదే సిట్యువేషన్ జరిగింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు, ఏకంగా పోలీసుల పైనే రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర దొంగలు హల్‌చల్ చేశారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వరుసగా హర్యానా ముఠా ఆవులను దొంగిలిస్తోంది. రైతులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. రాత్రి సమయంలో టాటా ఏసీ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు సమాచారం రావడంతో మధ్నూర్ ఎస్సై టాటా ఏస్ వాహనాన్ని వెంబడించారు. సుమారు రెండున్నర గంటలపాటు వాహనాన్ని ఛేజింగ్ చేసే ప్రయత్నం చేశారు. చివరకు రాష్ట్ర సరిహద్దు దాటడంతో మహారాష్ట్ర పోలీసుల సహకారంతో మరికల్ దగ్గర పట్టుకున్నారు.
కామారెడ్డి పోలీసులపై దుండగులు రాళ్లు, కర్రలు, ఐరన్ రాడ్లతో దాడి చేశారు. అయితే ఏ మాత్రం భయపడకుండా పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అంతరాష్ట్ర దొంగల ముఠాలోని ఏడుగురిలో ఒకర్ని పట్టుకున్నారు. మిగతా వారు వాహనం అక్కడే వదిలేసి పరారయ్యారు. వారి వద్ద నుంచి ఒక ఆవు, ఐరన్‌రాడ్లు, రాళ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి హర్షద్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మిగతా ఆరుగురి కోసం గాలిస్తున్నారు. వారి డీటేయిల్స్ కూడా సేకరించారు పోలీసులు.
ఈ దొంగల ముఠాకు నాయకుడు హర్యానాకు చెందిన షబ్బీర్‌గా గుర్తించారు. ధైర్య సాహసాలతో దొంగల ముఠాను పట్టుకున్న మద్నూర్ ఎస్సైకి 10 వేల రూపాయల నగదు పురస్కారం అందజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..