Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు.. మూడవ రోజు గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం..

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అమ్మవారు మూడవ రోజు..

Navaratri: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు.. మూడవ రోజు గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం..
Vijayawada Durga Devi
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 28, 2022 | 11:13 AM

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అమ్మవారు మూడవ రోజు గాయాత్రిదేవిగా అభయప్రదానం చేస్తున్నారు. ఉదయం 4 గంటలనుంచి భక్తుల్ని దర్శనాలకు అనుమతించారు. సకల మంత్రాలకు మూలమైన గాయత్రి శక్తిగా దర్శనమిస్తున్న అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్త, విద్రుమ, హేమనీల, దవళ వర్ణాలతో ప్రకాశిస్తూ.. పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటున్నారు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు.

బాసరలో వైభవంగా వేడుకలు..

నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీ శారద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి కుంకుమార్చనతో విశేష పూజలు చేశారు ఆలయ అర్చకులు. మూడవరోజు చంద్ర గంట అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదనగా పెట్టారు వేదపండితులు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తు పోటెత్తారు.

శ్రీశైల మహాక్షేత్రంలో..

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి మూడవరోజు గాయత్రీదేవి అలంకార రూపంలో శ్రీశైల భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై గాయత్రీ దేవి అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి మయూరవాహనాదీసులైన స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అర్చకులు,వేదపండితులు ఆలయ ఈవో లవన్న,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి,ట్రస్ట్ సభ్యులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు బాజా బజంత్రిలు బ్యాండ్ వాయిద్యాల నడుమ డప్పు చప్పుల్లు కోలాటాలు లంబాడీల ఆటపాటల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ పురవీధుల్లో వీహారించారు ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో పురవీధుల్లో గ్రామోత్సవంగా కదలివస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు

ఇవి కూడా చదవండి

తి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..